హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tata vehicles: టాటా మోటార్స్ అదుర్స్ .. అమ్మకాల్లో టాప్..! అత్యధికంగా సేల్స్ అవుతున్న కార్లు ఇవే.. !

Tata vehicles: టాటా మోటార్స్ అదుర్స్ .. అమ్మకాల్లో టాప్..! అత్యధికంగా సేల్స్ అవుతున్న కార్లు ఇవే.. !

టాటా మోటార్స్ అదుర్స్ .. అమ్మకాల్లో టాప్. అత్యధికంగా సేల్స్ అవుతున్న కార్లు ఇవే.. !

టాటా మోటార్స్ అదుర్స్ .. అమ్మకాల్లో టాప్. అత్యధికంగా సేల్స్ అవుతున్న కార్లు ఇవే.. !

టాటా మోటార్స్‌(Tata Motors) నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్ల వివరాలతో పాటు 2022 జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 టాటా వెహికల్స్(Vehicles) ఏవో తెలుసుకుందాం.

ఇండియన్ ఆటోమొబైల్(Auto Mobile) ఇండస్ట్రీ లాభాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బ్రాండ్ టాటా మోటార్స్(Tata Motors) వెహికల్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. టాటా నుంచి వచ్చిన నెక్సాన్ SUV మంచి ప్రజాదరణ పొందింది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, రెండు EV వేరియంట్ల(Variant)లో లభిస్తోంది. మంచి ఫ్లెక్సిబిలిటీతో కార్ల తయారీ సంస్థ భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్‌ను చాలా కాలం పాటు వెనక్కు నెడుతోంది. మొత్తం SUV విక్రయాలలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను అధిగమించగలిగింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్ల వివరాలతో పాటు 2022 జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 టాటా వెహికల్స్ ఏవో తెలుసుకుందాం.

నెక్సాన్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ నుంచి వచ్చిన నెక్సాన్ మోడల్... కంపెనీ తరఫున అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. జూన్ 2022లో హ్యుందాయ్ క్రెటాను కంపెనీ వెనక్కు నెట్టింది. మొత్తం ఎస్‌యూవీ, ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్‌లో కంపెనీ టాప్ ప్లేస్‌లో ఉంది. టాటా కంపెనీ గత నెలలో మొత్తం 14,295 నెక్సాన్ యూనిట్లను అమ్మగలిగింది. జూన్ 2021లో ఈ సంఖ్య 8,033గా ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో 78 శాతం వృద్ధి కనిపించింది.

మార్కెట్లో నెక్సాన్‌కు పోటీదారుగా ఉన్న హ్యుందాయ్ వెన్యూ.. జూన్ 2021లో 10,321 యూనిట్లను విక్రయించింది. ఇది నెక్సాన్ సేల్స్ కంటే 38.5 శాతం తక్కువ. నెక్సాన్‌కు పోటీదారులుగా మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, టయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్లు ఉన్నాయి. 2022 జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన 25 వాహనాల జాబితాలో బ్రెజ్జా స్థానం కోల్పోయింది. నెక్సాన్ సేల్స్.. కియా సోనెట్‌ కంటే 91 శాతం, టయోటా అర్బన్ క్రూయిజర్‌ కంటే 169 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి: Viral: అయ్యబాబోయ్.. చైనా వాళ్లు మళ్లీ భయపెట్టేస్తున్నారు..! ఈసారి కరోనా‌తో కాదు అదేదో కొత్త రకం ఐస్‌క్రీమ్‌తో.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?


టాటా పంచ్

టాటా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో వాహనంగా టాటా పంచ్ ఎస్‌యూవీ నిలిచింది. 2022 జూన్‌లో టాటా పంచ్ 10,414 యూనిట్లను విక్రయించింది. ఇది హ్యుందాయ్ వెన్యూ కంటే 0.9 శాతం ఎక్కువ. అయితే రెండు వేరియంట్లు ఒకే విభాగంలో పోటీ పడలేదు.

టాటా ఆల్ట్రోజ్

2022 జూన్‌లో 5,366 యూనిట్ల అమ్మకాలతో టాటా ఆల్ట్రోజ్ మూడో స్థానంలో నిలిచింది. టాటా ఆల్ట్రోజ్ అమ్మకాలు గత ఏడాది జూన్‌లో 6,350 యూనిట్లు. సంవత్సరం పరంగా వృద్ధిలో మొత్తం అమ్మకాలు 15 శాతం క్షీణించాయి.

టాటా ఆల్ట్రోజ్ పోటీదారులలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా, హోండా జాజ్ ఉన్నాయి. 2022 జూన్‌లో గ్లాంజా, జాజ్‌లు టాప్ 25 సేల్స్ లిస్ట్‌లో చేరలేకపోయాయి. బాలెనో, i20 వేరియంట్లు.. ఆల్ట్రోజ్ కంటే ఎక్కువ పరిమాణంలో, వరుసగా 200 శాతం, 47.6 శాతం అమ్ముడయ్యాయి.

టాటా టియాగో, టిగోర్

2022 జూన్‌లో టాటా టియాగో, టిగోర్ వరుసగా 5,310 యూనిట్లు, 4,931 యూనిట్లను విక్రయించి టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ టాటా కార్ల జాబితాలో నాలుగు, ఐదో స్థానంలో నిలిచాయి. సంవత్సరం పరంగా చూస్తే.. టాటా టియాగో 9 శాతం వృద్ధిని నమోదు చేయగా, టిగోర్ 358 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Published by:Mahesh
First published:

Tags: Car prices, Ratan Tata, Tata cars, Tata Motors

ఉత్తమ కథలు