ఐపీఎల్ సందడి మొదలైంది. వేసవి మొత్తం ఐపీఎల్ సందడి కొనసాగనుంది. మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లు (IPL Live Matches) చూస్తుంటారా? ఐపీఎల్ చూసేందుకు ఇప్పుడు ఉన్న డేటా చాలట్లేదా? రిలయన్స్ జియో ప్రత్యేకంగా క్రికెట్ ప్లాన్స్ అందిస్తోంది. జియో క్రికెట్ ప్లాన్స్‌లో (Jio Cricket Plans) ప్రతీ రోజూ ఎక్కువ డేటా లభించడంతో పాటు ప్లాన్ గడువులో వాడుకోవడానికి అదనంగా డేటా కూడా లభిస్తుంది. రూ.999, రూ.399, రూ.219 ధరకు ఈ ప్లాన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. ఇవి కాకుండా అదనంగా డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.
Jio Rs 999 Plan: జియో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ చొప్పున 252జీబీ డేటా లభిస్తుంది. అదనంగా మరో 40జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల్లో మొత్తం 292జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారికి అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
WhatsApp Trick: వాట్సప్ ఓపెన్ చేయకుండా మెసేజెస్ చదవొచ్చు... ఈ ట్రిక్ మీకోసమే
Jio Rs 399 Plan: జియో రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ చొప్పున 84జీబీ డేటా లభిస్తుంది. అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల్లో మొత్తం 90జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారికి అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
Jio Rs 219 Plan: జియో రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ చొప్పున 42జీబీ డేటా లభిస్తుంది. అదనంగా మరో 2జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల్లో మొత్తం 44జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారికి అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
AC Buying Guide: కొత్త ఏసీ కొంటున్నారా? కెపాసిటీ, ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయండి
వీటితో పాటు డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.667 రీఛార్జ్ చేస్తే 90 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 150జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.444 రీఛార్జ్ చేస్తే 60 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.222 రీఛార్జ్ చేస్తే 100జీబీ డేటా వాడుకోవచ్చు. యాక్టీవ్ ప్లాన్ ఉన్నవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2023, Jio, Reliance Jio