టాటా గ్రూప్ నుంచి మరో కొత్త సర్వీస్ వచ్చేసింది. టాటా గ్రూప్ ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్‌ను (Tata Super App) రిలీజ్ చేసింది. టాటా న్యూ (Tata Neu) పేరుతో ఈ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. టాటా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు టాటా గ్రూప్ ఉద్యోగులకు, ఇన్విటేషన్ ఉన్నవారికి మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు యూజర్లు అందరికీ ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. "ఇవాళ కొత్త రోజు. టాటా డిజిటల్ టాటా కుటుంబంలోని అతి పిన్న వయస్కుడు. టాటా న్యూ మీ ముందుకు వచ్చేసింది" అని టాటా గ్రూప్ ఛైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా న్యూ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు.
ఇప్పటికే అనేక బ్రాండ్స్‌ని భారతీయులకు పరిచయం చేసిన టాటా గ్రూప్ ఇప్పుడు టాటా న్యూ యాప్ ద్వారా సేవల్ని అందించేందుకు వచ్చింది. టాటా సూపర్ యాప్ రూపకల్పనకు 2020 లోనే అడుగులు పడ్డాయి. ఏడాదిన్నర కృషి తర్వాత ఈ యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది టాటా గ్రూప్. భారతీయుల జీవితాలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు టాటా గ్రూప్ చెబుతోంది.
Realme 9 4G: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9 4జీ మోడల్ వచ్చేసింది
What’s new? Tata Neu! Say hello to the superhero of apps. @tata_neu brings together all our brands you know and love under our first ever super app. ? #ThisIsTata #TataNeu pic.twitter.com/2be7pXyZQc
— Tata Group (@TataCompanies) April 7, 2022
టాటా సూపర్ యాప్ అయిన "టాటా న్యూ" ప్రత్యేకతలు చూస్తే యాప్ చూడటానికి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ప్రీమియం లుక్ కనిపిస్తోంది. ఇందులో న్యూకాయిన్స్ పేరుతో రివార్డ్ సెక్షన్ ఉంది. కస్టమర్లు న్యూకాయిన్స్‌ను ఈ యాప్‌తో పాటు ఫిజికల్ స్టోర్స్‌లో కూడా కలెక్ట్ చేయొచ్చు. టాటా న్యూ యూజర్లు టాటా క్లిక్, బిగ్‌బాస్కెట్, ఎయిర్ ఏసియా ఇండియా, క్రోమా లాంటి టాటా బ్రాండ్స్‌ని ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు.
Mi Fan Festival: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 డిస్కౌంట్... ఆఫర్ కొద్ది రోజులే
టాటా న్యూ యాప్‌లో గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ డెలివరీ, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్ లాంటి సేవలన్నీ లభిస్తాయి. వేర్వేరు సేవలకు వేర్వేరు యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్‌లో అన్ని సేవల్ని పొందొచ్చు. టాటా పే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. మొబైల్ రీఛార్జ్ దగ్గర్నుంచి డీటీహెచ్ సేవల వరకు అన్ని రకాల పేమెంట్స్ చేయొచ్చు.
టాటా న్యూ యాప్‌లో బయ్ నౌ పే లేటర్, డిజిటల్ గోల్డ్, ఇన్స్యూరెన్స్, పర్సనల్ లోన్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిగ్ బాస్కెట్ నుంచి సరుకుల్ని, 1ఎంజీ నుంచి మందుల్ని తెప్పించుకోవచ్చు. టాటా న్యూ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online shopping, Tata Group, Tata neu, TATA Sons