Home /News /technology /

TAMIL NADU STUDENTS BUILD SOLAR BICYCLE WORTH RS 10000 TO OVERTAKE THE FUEL PRICE HIKE HERE FULL DETAILS NS GH

Solar Bicycle: రూ.10 వేలకే సోలార్ సైకిల్.. పెట్రోల్ అవసరమే లేదు.. వివరాలివే

సోలార్ సైకిల్ తయారు చేసిన విద్యార్థులు

సోలార్ సైకిల్ తయారు చేసిన విద్యార్థులు

తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు పెట్రోల్ అవసరం లేని సోలార్ సైకిల్‌ను తయారు చేశారు. ఈ సైకిల్ సోలార్ బ్యాటరీ ఛార్జింగ్‌తో గంటకు 25-35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో బైకులు బయటకు తీయాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ అవసరం లేని సోలార్ సైకిల్‌ను తయారు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు. సోలార్ బ్యాటరీ ఛార్జింగ్‌తో నడిచే ఈ సైకిల్ గంటకు 25-35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని ఈ అన్నాతమ్ములు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సూర్యరశ్మిలో 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 5 గంటల పాటు ఛార్జింగ్‌ పెట్టినా.. ఈ సైకిల్ పై ఎంచక్కా ప్రయాణించవచ్చు. అంతేకాదు, సూర్యరశ్మి ఉన్నా.. లేకపోయినా.. ఈ సైకిల్ ని తొక్కుతూ ప్రయాణం చేయొచ్చు. ఇది 150 కిలోల వరకు బరువు మోయగలదు. మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఛార్జింగ్ స్లాట్లు కూడా ఈ సైకిల్‌లో ఉన్నాయని ఈ బాలురు చెబుతున్నారు.
Hero Maestro Edge: సరికొత్త ఫీచర్లతో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ లాంఛ్.. ధర, ఫీచర్ల వివరాలివే

పూర్తి వివరాల్లోకి వెళితే.. శివగంగై కాలేజీ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న వీరపతిరన్, అమాని దంపతులకు వీరగురుహరికృష్ణన్ (12), సంపత్ కృష్ణన్ (11) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరగురుహరికృష్ణన్ తిరుపువనంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. సంపత్ కృష్ణన్ శివగంగై స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్నాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో స్కూల్స్ మూసివేయడంతో ఈ అన్నదమ్ములు సైకిళ్లపై చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేశారు.

ఆ సమయంలోనే వారికి పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి తెలిసింది. అప్పుడు వారికి పెట్రోల్ లేకుండా నడిచే వాహనాలు తయారు చేయలేమా అనే ఆలోచన వచ్చింది. అందుకోసం తమ దగ్గర ఉన్న సైకిళ్లతో ఏం చేయగలమో ఆలోచించారు. చివరికి సోలార్ సైకిల్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఆన్‌లైన్, స్థానిక దుకాణాల‌లో సోలార్ సైకిల్ తయారీకి కావలసిన బ్యాటరీ, మోటారు, సోలార్‌ ప్లేట్లు కొనుగోలు చేశారు. తరువాత అన్ని పరికరాలను సక్రమంగా అమర్చి సోలార్ సైకిల్ ని ఆవిష్కరించారు.

అయితే, సైకిల్ తో సహా అన్ని పరికరాలకు కేవలం 10,000 రూపాయలే ఖర్చయిందని వీరగురు హరికృష్ణన్ తెలిపాడు. సరైన పరికరాలతో సైకిల్ వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చని కూడా అతడు తెలిపాడు. ఏది ఏమైనా, మొబైల్ ఫోన్లతో కాలం గడిపేస్తున్న ఈ రోజుల్లో ఇద్దరు చిన్నారులు ఎంతో ఉపయోగకరమైన సైకిల్ తయారు చేయడం ప్రశంసనీయం. వారు తయారు చేసిన సైకిల్ కారణంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. పర్యావరణానికి ఎటువంటి నష్టం కలుగకుండా వీరు చేసిన సోలార్ సైకిల్ ప్రస్తుతం నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Students, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు