చంద్రయాన్ 2 తీసిన చందమామ ఫస్ట్ ఫొటో.. చంద్రుడిని ఇంత దగ్గరి నుంచి..

చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి మొట్టమొదటి ఫొటోను పంపింది.

news18-telugu
Updated: August 22, 2019, 8:17 PM IST
చంద్రయాన్ 2 తీసిన చందమామ ఫస్ట్ ఫొటో.. చంద్రుడిని ఇంత దగ్గరి నుంచి..
చంద్రయాన్ 2 ఉపగ్రహం తీసిన చందమామ ఫొటో (Image:ISRO/Twitter)
news18-telugu
Updated: August 22, 2019, 8:17 PM IST
చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి మొట్టమొదటి ఫొటోను పంపింది. దీన్ని ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రపంచానికి పరిచయం చేసింది. చంద్రుడి కక్ష్యలో సుమారు 2650 కిలోమీటర్ల దూరం నుంచి చందమామను ఫొటో తీసి పంపింది. ఆగస్ట్ 21వ తేదీన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్టు పేర్కొంది. ఇటీవలే ఇస్రో తన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో చంద్రుడి మీద విక్రమ లాండర్‌ను దింపనుంది. అత్యంత క్లిష్టమైన ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో కొత్త చరిత్రను లిఖించినట్టు అవుతుంది.



First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...