Home /News /technology /

TAKE A LOOK AT SAMSUNG GALAXY Z FLIP 3 AND GALAXY WATCH 4S BESPOKE EDITION GH SSR

Samsung Galaxy Z Flip 3: శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఎడిషన్ లాంచ్​.. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌‌ స్పెషాలిటీ ఏంటంటే...

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 (Samsung Galaxy Z Flip 3)

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 (Samsung Galaxy Z Flip 3)

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త వన్​ యూఐ4 ఆపరేటింగ్​ సిస్టమ్​ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. దీన్ని మొదట గెలాక్సీ జెడ్​ స్మార్ట్​ఫోన్​లో, ఆ తర్వాత ఇతర స్మార్ట్​ఫోన్లలో అందించే అవకాశం ఉంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శామ్​సంగ్ నుంచి గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 (Galaxy Z Flip 3) ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్​ లాంచ్ అయింది. దీంతోపాటు గెలాక్సీ వాచ్​ 4ను (Galaxy Watch 4) సైతం సంస్థ విడుదల చేసింది. ఈ రెండు బీస్పోక్ (Bespoke) ఎడిషన్లను శామ్‌సంగ్.. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2 ఈవెంట్​లో లాంచ్​ చేసింది.

కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కొత్త కలర్​ ఆప్షన్లలో వీటిని ఆవిష్కరించింది. ఫలితంగా గెలాక్సీ Z ఫ్లిప్ 3 బీస్పోక్ ఎడిషన్ మొత్తం 49 కలర్లలో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ లేదా సిల్వర్ ఫోన్ ఫ్రేమ్ ఆప్షన్లతో పాటు బ్లూ, ఎల్లో, పింక్, వైట్ లేదా బ్లాక్ కలర్​ కాంబినేషన్లలో ఇవి విడుదలయ్యాయి.

ఇది కూడా చదవండి: Vivo Y3s: వివో నుంచి రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 బీస్పోక్ ఎడిషన్​లో అప్‌గ్రేడ్ కేర్‌ను కూడా సంస్థ అందిస్తోంది. తద్వారా ఎప్పటికప్పుడు యూజర్లు తాము కోరుకున్న రంగులను మార్చుకోవచ్చు. గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 3 అమ్మకాలు అక్టోబర్ 20 నుంచి ప్రారంభమయ్యాయి. దీని ధర 1,020 డాలర్లు (సుమారు రూ. 76,300) నుంచి ప్రారంభమవుతోంది. అయితే గెలాక్సీ వాచ్ 4 బీస్పోక్ ఎడిషన్ ధరలపై మాత్రం స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి: Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

వన్​ యూఐ 4 ఓఎస్​తో​ పనిచేసే స్మార్ట్​ఫోన్​..

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త వన్​ యూఐ4 ఆపరేటింగ్​ సిస్టమ్​ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. దీన్ని మొదట గెలాక్సీ జెడ్​ స్మార్ట్​ఫోన్​లో, ఆ తర్వాత ఇతర స్మార్ట్​ఫోన్లలో అందించే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 3.. వన్ యూఐ 4 ఓఎస్​పై పనిచేస్తుంది. దీనిలోని కెమెరా సహాయంతో యాప్ బ్యాక్‌గ్రౌండ్ లేదా బ్లర్​ ఇమేజ్‌లను తొలగించవచ్చు. దీని వాల్‌పేపర్ కలర్​ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్​ఫోన్లను శాంసంగ్ ఇప్పటికే దక్షిణ కొరియాలో లాంచ్​ చేసింది. వీటిలో వన్ యుఐ 4 బీటా అప్‌డేట్‌ను అందించింది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: 5G Smartphone, Samsung Galaxy, Smartphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు