హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Ear Phones: రూ.2 వేలు విలువైన ఇయర్‌ ఫోన్స్‌ కేవలం రూ.599కే! కొంత కాలమే ఈ ఆఫర్!

Ear Phones: రూ.2 వేలు విలువైన ఇయర్‌ ఫోన్స్‌ కేవలం రూ.599కే! కొంత కాలమే ఈ ఆఫర్!

Ear Phones: రూ.2 వేలు విలువైన ఇయర్‌ ఫోన్స్‌ కేవలం రూ.599కే! కొంత కాలమే ఈ ఆఫర్!

Ear Phones: రూ.2 వేలు విలువైన ఇయర్‌ ఫోన్స్‌ కేవలం రూ.599కే! కొంత కాలమే ఈ ఆఫర్!

swott Ear phones | మీరు కొత్త బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఇయర్ ఫోన్స‌‌ను ఒకసారి పరిశీలించండి. తక్కువ ధరకే లభిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Swott Ear Buds | ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా నెక్ బ్యాండ్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ (Offer) ఒకటి అందుబాటులో ఉంది. మార్కెట్‌లోకి కొత్త నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ (Ear Phones) వచ్చాయి. కంపెనీ వీటిని తక్కువ ధరకే అందిస్తోంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా వీటిని తక్కువ ధకే పొందొచ్చు.

ఈ లాంచ్ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది. తర్వాత నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ధర మళ్లీ పెరగొచ్చు. అందువల్ల మీరు కొత్త నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. వెంటనే ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోండి. ఇండియన్ స్మార్ట్ వేరబుల్ కంపెనీ స్కాట్ తాజాగా తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకుంది. నెకాన్ 101 పేరుతో బ్లూటూత్ నెక్ బ్యాండ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

శుభవార్త.. రూ.2 వేలు పతనమైన బంగారం ధర.. నెల రోజుల్లోనే భారీగా దిగొచ్చిన గోల్డ్!

ఈ స్కాట్ నెకాన్ 101 ఇయర్ ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, హెచ్‌డీ స్టీరియో సౌండ్, ఎన్‌హ్యాన్సడ్ బాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ నెక్ బ్యాండ్ 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ నెక్ బ్యాంక్‌ను రూ. 599 ఇంట్రడక్షరీ ప్రైస్‌తో కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా తక్కువకు వస్తోంది. ఇది బ్లాక్, బ్లూ రంగుల్లో లభిస్తోంది. అమెజాన్‌లో కొనొచ్చు. అయితే ఇది ప్రస్తుతం స్టాక్ లేదు. అందుకని మీరు స్కాట్‌లైఫ్‌స్టైల్.కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా కొనొచ్చు.

వచ్చే వారంలో బ్యాంకులు 3 రోజులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే?

ఈ స్కాట్ నెకాన్ 101 బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఎంఆర్‌పీ రూ. 1990. అంటే ఏకంగా 70 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ బ్లూటూత్ హెడ్‌ఫోన్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఐపీఎక్స్7 రేటింగ్ ఉంది. వాటర్, స్వెట్ రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది. ఇందులో ఇంకా బ్లూటూత్ 5, 10 ఎంఎం ఆయో డ్రైవర్ యూనిట్, గేమింగ్ మోడ్, ఏఎన్‌సీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు డివైజ్‌లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. 40 నిమిషాలు చార్జీలు పెడితే 30 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది.  అందువల్ల మీరు కొత్త ఇయర్ ఫోన్స్ కొనాలని భావిస్తే.. ఇప్పుడు ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోండి. లేదంటే రూ.2 వేలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఇతర ప్రొడక్టులను గమనిస్తే.. రూ. 599 అంటే తక్కువ ధరకే అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Bumper offer, Ear buds, Ear phones, Head phones, Latest offers

ఉత్తమ కథలు