దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki Cars) భారత్‌లోనే కాదు ఇతర దేశాల్లోనూ అదిరిపోయే కార్లను ఆవిష్కరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జపాన్ (Japna) మార్కెట్లో న్యూ జనరేషన్ ఆల్టో (Alto) ఎంట్రీ-లెవల్ కారును అధికారికంగా (Unveiled) ఆవిష్కరించింది. ఆల్టో మోడల్ 1979లోనే జపాన్‌లో ప్రవేశించింది. అయితే ఈ ఆల్టో మోడల్ అనేక సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటూ వస్తోంది. తాజాగా ఈ మోడల్లో నైన్త్ జనరేషన్(Ninth-gen) ఆల్టో కారును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతీ సుజుకీ. జపాన్ మార్కెట్లో అన్వీల్ చేసిన ఈ ఆల్టో ఎక్స్టీరియర్ సరికొత్త స్టైలింగ్‌ను కలిగి ఉంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ ఆల్టోకి జపాన్ మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రెండు కార్ల పేర్లు ఒకటే కానీ ఇవి విభిన్న డిజైన్, ఇంటీరియర్, పవర్‌ట్రెయిన్ కలిగి ఉంటాయి. తొమ్మిదవ-తరం ఆల్టో కొత్త బాడీ ప్యానెల్లు, డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. బాక్సీ (boxy) ఆకారం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.
గత ఆల్టో కార్లతో పోలిస్తే ప్రస్తుత ఆల్టో కార్ ప్రపోర్షన్లు మాత్రం మృదువుగా, మరింత గుండ్రంగా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ ఫాసియా (front facia)/ కారు ముందు భాగం ఇప్పటికీ పెద్ద ట్రాపెజోయిడల్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. అయితే ఈ హెడ్‌ల్యాంప్‌లతో సహా కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ జోడించారు. అలాగే హెడ్‌ల్యాంప్‌ల మధ్య క్రోమ్ బార్‌తో చిన్న ఫ్రంట్ గ్రిల్ కూడా అందించారు.
Omicron: పిల్లల్లో పెరుగుతున్న కోవిడ్ ఇన్ఫెక్షన్లు.. దక్షిణాఫ్రికా ఆందోళన
పెద్ద విండో గ్లాసెస్‌తో డిజైన్..
ఆల్టో కారులో విండ్‌షీల్డ్ ను ఇప్పుడు మరింత నిటారుగా ఇన్స్టాల్ (Instal) చేశారు. ఎక్కువ గాలిని ఆస్వాదించేందుకు పెద్ద విండో గ్లాసెస్‌ను అమర్చారు. ఈ కారులో A-పిల్లర్ (కారు ముందు సీట్ల భాగం)ను మరింత నిటారుగా ఇచ్చారు. ఫలితంగా కొత్త ఆల్టో కారు దాని అవుట్గోయింగ్ మోడల్ కంటే బాక్సియర్గా కనిపిస్తుంది. వెనుక భాగంలో సరికొత్త టెయిల్‌గేట్, బంపర్లు, నిటారుగా ఉండే టెయిల్-లైట్లను అమర్చారు. కొత్త ఆల్టో సెవెన్-స్పోక్ వీల్స్‌ను కూడా కలిగి ఉంది. ఇది డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది.
అదిరిపోయే ఇంటీరియర్..
కారు ఇంటీరియర్ విషయానికొస్తే.. సుజుకీ ఆల్టో సరికొత్త క్యాబిన్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో నిలువుగా పేర్చిన ఏసీ వెంట్లు అవుట్గోయింగ్ మోడల్‌తో సమానంగా ఉన్నాయి. ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ (Bluetooth controls) తో కొత్త స్టీరింగ్ వీల్ అందించారు. పెద్ద అనలాగ్ స్పీడోమీటర్‌తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పరిచయం చేశారు. సరికొత్త ఇంటిగ్రేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. ముందు సీట్లు వన్-పీస్ డిజైన్, వెనుక సీట్లు బెంచ్-స్టైల్ లో ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ సీట్లు అవుట్గోయింగ్ మోడల్ లాగానే అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లతో వస్తాయి.
Google Drive: గూగుల్ డ్రైవ్‌లో ఫైల్ డెలిట్ అయిందా.. తిరిగి ఇలా పొందడి!
సుజుకీ సేఫ్టీ సపోర్ట్‌లో భాగంగా యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్‌లు, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో సహా పాదచారులను గుర్తించడం, కొల్లిషన్ అవొడెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు. కొత్త ఆల్టో ఇంజిన్ లేదా పనితీరు గురించి సుజుకీ ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. కొత్త-జెన్ ఆల్టో 660సీసీ, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని సమాచారం. ఇందులో కొత్త మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుందని టాక్. గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఇప్పటివరకైతే వెల్లడించలేదు. ఐదు-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్టో ఈ ఏడాది చివరి నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Cars, MARUTI SUZUKI, New cars