ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు షాక్... జరిమానా చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు

అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నిర్వచనాన్నే సుప్రీం కోర్టు సమర్థించింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలకు సంబంధించి అసలు, వడ్డీ, జరిమానా మొత్తం చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

news18-telugu
Updated: October 24, 2019, 3:28 PM IST
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు షాక్... జరిమానా చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు
ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాట్‌ఫాం వేదికగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన బెనిఫిట్స్ అందిస్తామని తెలిపింది.
  • Share this:
టెలికామ్ కంపెనీలకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ-AGR విషయంలో 2005 నుంచి కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ-AGR విషయంలో టెలికాం కంపెనీల వాదనల్లో అర్థం లేదని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు... కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ-AGR నిర్వచనం విషయంలో టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికాం కంపెనీల మధ్య 14 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. టెర్మినేషన్ ఫీజు, రోమింగ్ ఛార్జీలు తప్ప మిగతా ఆదాయాలన్నీ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో భాగమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే నాన్-టెలికామ్, నాన్-కోర్ రెవెన్యూ ఏజీఆర్‌లో భాగం కాదని టెలికాం కంపెనీలు వాదిస్తూ వస్తున్నాయి. ఏజీఆర్ లెక్కించడం విషయంలో 2005 నుంచి టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికాం కంపెనీల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది. 14 ఏళ్ల సాగుతున్న వివాదం చివరకు ముగిసింది. చివరకు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నిర్వచనాన్నే సుప్రీం కోర్టు సమర్థించింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలకు సంబంధించి అసలు, వడ్డీ, జరిమానా మొత్తం చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

సుప్రీం కోర్టు తీర్పుతో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయెన్స్ కమ్యూనికేషన్ లాంటి కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈ కంపెనీలన్నీ టెలీకమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌కు 1.33 లక్షల కోట్ల వరకు చెల్లించాల్సిందే. ఇందులో రూ.92,000 కోట్లు లైసెన్స్ ఫీజు కాగా, రూ.41,000 కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు. రూ.92,000 కోట్ల లైసెన్స్ ఫీజులో భారతీ ఎయిర్‌టెల్ వాటా రూ.21,682 కోట్లు, వొడాఫోన్ ఐడియా వాటా రూ.28,300 కోట్లు, ఆర్‌కామ్ వాటా రూ.16,500 కోట్లు, బీఎస్ఎన్ఎల్ వాటా రూ.2100 కోట్లు, ఎంటీఎన్ఎల్ వాటా రూ.2,537 కోట్లు ఉంది. ఇక రూ.41,000 కోట్లు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల్లో భారతీ ఎయిర్‌టెల్ వాటా రూ.22,943 కోట్లు, వొడాఫోన్ ఐడియా వాటా రూ.11,000 కోట్లు, ఆర్‌కామ్ వాటా రూ.3,533 కోట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు రాగానే ఆయా కంపెనీల షేర్లు కుప్పకూలాయి. వొడాఫోన్ ఐడియా షేర్ 18.58 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 4.34 శాతం, భారతీ ఎయిర్‌టెల్ షేర్ 7.31 శాతం పతనమైంది.

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

Google Apps: గూగుల్ నుంచి 5 కొత్త యాప్స్... ప్రత్యేకతలివే

Diwali Gift: దీపావళికి గిఫ్ట్ తీసుకుంటున్నారా? మీరు కట్టాల్సిన ట్యాక్సులు ఇవే...Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: October 24, 2019, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading