Solar Cycle 25: కొత్త సౌర చక్రంలోకి ప్రవేశించిన సూర్యుడు... యుగాంత సంకేతమా?

Solar Cycle 25: అసలేంటి సౌరచక్రం అంటే... దాని వల్ల భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎందుకు ఖగోళ శాస్త్రవేత్తలు... సూర్యుణ్ని ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు?

news18-telugu
Updated: September 22, 2020, 11:17 AM IST
Solar Cycle 25: కొత్త సౌర చక్రంలోకి ప్రవేశించిన సూర్యుడు... యుగాంత సంకేతమా?
Solar Cycle 25: కొత్త సౌర చక్రంలోకి ప్రవేశించిన సూర్యుడు... యుగాంత సంకేతమా? (credit - NASA)
  • Share this:
Solar Cycle 25: సూర్యుడు కొత్త సౌర చక్రంలోకి ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా (NASA) ప్రకటించింది. దీన్ని ‘సౌర చక్రం 25’గా పిలుస్తారు. మన సౌర వ్యవస్థకు గుండె లాంటి సూర్యుడు... కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ప్రారంభమైన 25వ సౌర చక్రమిది. సూర్యుడు మండే అగ్నిగోళంలా, ప్రకాశించే వాయువుగా కన్పిస్తుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు ఇలా కొత్త సౌర చక్రంలోకి ప్రవేశిస్తాడు. అంటే... సూర్యుడి అయస్కాంత క్షేత్రం మారుతుంది. అంటే... ఉత్తర ధృవం, దక్షిణ ధృవం తమ స్థానాలను మార్చుకుంటాయి. తద్వారా ఏర్పడే కొత్త సౌర వ్యవస్థలో గ్రహాలు కూడా భాగం అవుతాయి. సూర్యుడు, భూమి మధ్య కనెక్షన్... గ్రహం మీద జంతువులు, జీవవైవిధ్యం, సముద్ర ప్రవాహాలు, వాతావరణాన్ని నడిపిస్తుంది.

ఈ సోలార్ సైకిల్ ప్రభావం సౌర వ్యవస్థ అంతటా ఉంటుంది. కొత్త సౌర చక్రంలో ఎన్నో విస్పోటాలుంటాయి. తీవ్రమైన రేడియేషన్ల విడుదలవుతుంది. ఇలాంటి ఎన్నో అల్లకల్లోలాలు సూర్యుడి ఉపరితలంపై జరుగుతాయి. ఇవి ఇతర గ్రహాలపై ప్రభావితం చూపుతాయి. కొత్త సౌరచక్రం 2019 డిసెంబర్లో ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కనిపెట్టేందుకు ఇన్ని నెలలు పట్టింది. కాలక్రమేణా సౌర చక్రం బలహీనపడుతోందని ‘సోలార్ సైకిల్ 25 ప్రిడిక్షన్ ప్యానెల్’ తెలిపింది. అందువల్ల ప్రస్తుతం సూర్యుడిపై అల్లకల్లోలాలు తక్కువగా ఉన్నాయి. 2021 నుంచి... 2025 వచ్చే వరకూ సూర్యుడిపై ప్రళయాలు క్రమంగా పెరగనున్నాయి. వాటి ప్రభావం భూమిపై పడనుంది.


సౌర చక్రం కారణంగా... స్పేస్-బేస్డ్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్లతో పాటు రేడియో కమ్యూనికేషన్లలో ప్రభావం ఎక్కువగా ఉండనుంది. సూర్యుడు కొత్త సౌరచక్రంలోకి ప్రవేశించడంపై వాషింగ్టన్ డి.సి.లోని నాసా ప్రధాన కార్యాలయంలోని హెలియోఫిజిక్స్ విభాగం ప్రోగ్రామ్ శాస్త్రవేత్త లికా గుహతకుర్తా మాట్లాడుతూ ‘‘గత 40 సంవత్సరాల నుంచి మేము సూర్యుడిని చాలా నిశితంగా పరిశీలించాము" అని అన్నారు. “మనం సౌరవ్యవస్థలో, వాతావరణంలో జరిగే మార్పులతో వచ్చే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. అంతరిక్ష వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండటమే మన పని” అని వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాలయంలో నాసా మానవ అన్వేషణ, కార్యకలాపాల మిషన్ డైరెక్టరేట్ వివరించింది.


నాసా పరిశోధకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి సూచనలతో సౌరవ్యవస్థలో మార్పులను బాగా అర్థం చేసుకోవడానికి సూర్యుడిపై అధ్యయనాలు చేస్తున్నారు.


గత సౌర చక్రం:
మునుపటి సౌర చక్రం 2008లో ప్రారంభమైంది. రాబోయే సౌరచక్రం 2025 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయిన్నప్పటికీ మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర చక్రం యొక్క ప్రభావాలు మనం ఇప్పటివరకూ అనుభవించిన వాటికి భిన్నంగా ఏమీ ఉండవని NOAA అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రంలో సౌర భౌతిక శాస్త్రవేత్త, ప్రిడిక్షన్ ప్యానెల్ కో చైర్ పర్సన్ డగ్ బీసెక్కర్ చెప్పారు.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading