Postinfo: పోస్ట్ ఆఫీస్‌కు వెళ్తుంటారా? అయితే ఈ యాప్ మీకోసమే

Postinfo: పోస్ట్ ఆఫీస్‌కు వెళ్తుంటారా? అయితే ఈ యాప్ మీకోసమే (image: PlayStore)

Postinfo App | మీరు తరచూ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్తుంటారా? పోస్టల్ సేవలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పోస్ట్ ఇన్ఫో యాప్‌లో పొందొచ్చు. ఈ యాప్ ఫీచర్స్ తెలుసుకోండి.

  • Share this:
    పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించి ఎలాంటి సేవలు పొందుతున్నా మీ సేవల్ని ట్రాక్ చేసేందుకు పోస్ట్‌ఇన్ఫో యాప్ ఉపయోగపడుతుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అఫీషియల్ యాప్ ఇది. ఇందులో మీరు పోస్ట్ ఆఫీస్‌కు సంబంధించిన అనేక సేవల్ని పొందొచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో Postinfo యాప్ ఉంది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ పౌరుల కోసం ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో ట్రాకింగ్, పోస్ట్ ఆఫీస్ సెర్చ్, పోస్టేజ్ క్యాలిక్యులేటర్, ఇన్స్యూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్, ఇంటరెస్ట్ క్యాలిక్యులేటర్ అందుబాటులో ఉంటాయి. మీకు దగ్గర్లో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పోస్ట్‌ఇన్ఫో యాప్‌లో ప్రాంతం పేరు లేదా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీసుల వివరాలు తెలుస్తాయి.

    పోస్ట్‌ఇన్ఫో యాప్‌లో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్, ఇన్స్యూర్డ్ లెటర్, వ్యాల్యూ పేయబుల్ లెటర్, ఇన్స్యూర్డ్ వ్యాల్యూ పేయబుల్ లెటర్, రిజిస్టర్డ్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ పీరియాడికల్స్, రిజిస్టర్డ్ పార్శిల్, ఇన్స్యూర్డ్ పార్శిల్, వ్యాల్యూ పేయబుల్ పార్శిల్, ఇన్స్యూర్డ్ వ్యాల్యూ పేయబుల్ పార్శిల్, బిజినెస్ పార్శిల్, బిజినెస్ పార్శిల్ సీఓడీ, ఎక్స్‌ప్రెస్ పార్శిల్, ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సీఓడీ, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ లాంటి సేవల్ని ట్రాక్ చేయొచ్చు. ఇందుకోసం రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి లెటర్ లేదా పార్శిల్ ఎక్కడ ఉందో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఆ వివరాలను సేవ్ చేయొచ్చు.

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

    EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి

    ఇక ఏ పార్శిల్‌కు ఎంత ఛార్జీ చెల్లించాలో కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఆర్డినరీ లెటర్, స్పీడ్ పోస్ట్ డొమెస్టిక్, రిజిస్టర్డ్ లెటర్, ఆర్డినరీ పార్శిల్, రిజిస్టర్డ్ పార్శిల్, రిజిస్టర్డ్ బుక్ ప్యాకెట్, ప్రింటెడ్ పుస్తకాలు ఉన్న రిజిస్టర్డ్ బుక్ ప్యాకెట్, ఆర్డినరీ రిజిస్టర్డ్ బుక్ ప్యాకెట్, న్యూస్ పేపర్స్ ఉన్న బుక్ ప్యాకెట్ ఇలా ఏ పార్శిల్ అయినా ఎంత ఛార్జీ చెల్లించాలో తెలుసుకోవచ్చు. మీరు పార్శిల్ పంపాలనుకునే ప్రాంతం ఎంత దూరంలో ఉంది అనేదాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయి. మొత్తం 5 శ్లాబ్స్ ఉంటాయి. లోకల్ పేరుతో మొదటి శ్లాబ్, 200 కిలోమీటర్ల వరకు రెండో శ్లాబ్, 201 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు మూడో శ్లాబ్, 1001 నుంచి 2000 కిలోమీటర్ల వరకు నాలుగో శ్లాబ్, 2000 కిలోమీటర్ల పైన ఐదో శ్లాబ్ ఉంటాయి.

    Driving Licence: స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

    Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

    ఇక పోస్ట్ ఆఫీసులో లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవచ్చు. వడ్డీ ఎంత వస్తుందో లెక్కించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: