Andhra to America: అమెరికాలో తెలుగమ్మాయి అద్భుతాలు.., SpaceXలో సత్తా చాటుతున్న సీత..

Andhra to America: అమెరికాలో తెలుగమ్మాయి అద్భుతాలు.., SpaceXలో సత్తా చాటుతున్న సీత..

Sita Sonty

SpaceX - Sita Sonti: కోనసీమ మూలాలున్న సీత శొంఠి ఇప్పుడు ప్రతిష్టాత్మక SpaceX మిషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో అమెరికా ప్రతినిథిగా విధులు నిర్వహించారు.

 • Share this:
  అగ్రరాజ్యం అమెరికాలో అవకాశాల కోసం చాలా మంది కలలుగంటారు. వాటిని కొందరే నిజం చేసుకుంటారు. కానీ కలను కూడా కాఫీ తాగినంత ఈజీగా నిజం చేసుకున్నారు సీత శొంఠి. అమెరికాలో పుట్టినా తెలుగుదనాన్ని మర్చిపోలేదు. అమ్మభాషను పక్కనబెట్టలేదు. సాంప్రదాయాలను వదులుకోలేదు. దాదాపు 10దేశాల్లో అమెరికా ప్రతినిథిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు...భారతీయతను కూడా అంతే ఉన్నతస్థానంలో నిలిపారామె. కొనసీమ మూలాలనున్న సీత శొంఠి ఇప్పుడు ప్రతిష్టాత్మక SpaceXలో మిషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీత తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు. ఆమె తండ్రి శ్రీరాం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వాసి. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసిన ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆమె తల్లి శరదా శొంఠి ప్రొఫెసర్. 1975లోనే అమెరికాకు వలస వెళ్లారు. సీత అమెరికాలోనే జన్మించారు.

  చదువుల్లో టాపర్
  అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్‌ కాలేజీలో పొలిటికల్‌ ఎకనామిక్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాక స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫ్రొఫెసర్ సలహాల మేరకు మిడిల్‌ ఈస్ట్‌ లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం అరబిక్ కూడా నేర్చుకున్నారు. సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్‌.. ఇలా మొత్తం 10 భాషలు నేర్చుకున్నారు. స్కూల్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఇంటర్నే1షనల్‌ స్టడీస్‌ (SAIS) మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్‌ డిపార్ట్‌ మెంట్‌లో చేరారు. ఆ డిపార్ట్‌మెంట్‌లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. అనంతరం ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్‌ వంటి దేశాలలోని అమెరికన్‌ ఎంబసీలలో పని చేశారు సీత.

  ఇరాక్ యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి
  ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా తరపున బాగ్దాద్ లో పనిచేశారు. బంకర్లలోనే విధులు నిర్విస్తూ మరణించిన వారి చేతులకు ట్యాగింగ్ కూడా చేశారు. అప్పుడు ఆమె వయసు 22ఏళ్లే. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. గడాఫీ మరణించిన టైమ్ లో లిబియాలోనే ఉన్నారు.

  పిల్లలే పంచప్రాణాలు
  సీతకు ఇద్దరు సంతానం. జయరామ్, ఆనంద.. అంటే ఆమెకు పంచ ప్రాణాలు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా పిల్లల ఆలనా పాలన ఆమె చూసుకుంటారు. వారిని క్రమంతప్పకుండా ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకెళ్తారు. స్వయంగా ఆమే వంటచేసి తినిపిస్తారు. పిల్లలు తెలుగులోనే మాట్లాడతారు. చదువులు, ఉద్యోగాల్లోనే కాదు కళల్లోనూ ఆమె టాపరే. సీత తన సోదరితో కలిసి సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, నాట్యంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. వరల్డ్‌ రెలిజియన్‌ కాన్ఫరెన్స్‌లో దలైలామా ఎదుట వేదమంత్రాలకు అనుగుణంగా నాట్యం చేసి ఔరా అనిపించుకున్నారు. అంతేకాదు శొంఠి సిస్టర్స్‌ పేరుతో భారత్ లో కూచిపూడి నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
  Published by:Purna Chandra
  First published: