• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • STREAMING SERVICES LIKE NETFLIX AFFECT OUR ENVIRONMENT AND HERE IS THE DETAILED EXPLANATION OF THESE TOPIC SSR GH

OTT: ఓటీటీ ప్లాట్​ఫాం​లలో హెచ్‌డీ వీడియోలను అదే పనిగా చూస్తున్నారా.. అలా చూడటం వల్ల ఇంత జరుగుతుందని తెలిస్తే..

OTT: ఓటీటీ ప్లాట్​ఫాం​లలో హెచ్‌డీ వీడియోలను అదే పనిగా చూస్తున్నారా.. అలా చూడటం వల్ల ఇంత జరుగుతుందని తెలిస్తే..

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా స్మార్ట్​యుగం నడుస్తోంది. కరోనా కారణంగా ఈ ధోరణి మరింత పెరిగింది. ఏ పనైనా సరే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చక్కబెట్టుకునేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, కాలు బయటపెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కావాల్సిన ఎంటర్​టైన్​మెంట్​ అందిస్తున్నాయి అనేక ఓటీటీ సంస్థలు హై క్వాలిటీ వీడియోలను ప్రసారం చేస్తుండటంతో ...

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడంతా స్మార్ట్​యుగం నడుస్తోంది. కరోనా కారణంగా ఈ ధోరణి మరింత పెరిగింది. ఏ పనైనా సరే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చక్కబెట్టుకునేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, కాలు బయటపెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కావాల్సిన ఎంటర్​టైన్​మెంట్​ అందిస్తున్నాయి అనేక ఓటీటీ సంస్థలు హై క్వాలిటీ వీడియోలను ప్రసారం చేస్తుండటంతో వీటికి డిమాండ్​ అమాంతం పెరుగుతోంది. అందువల్లే, నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ ద్వారానే వెబ్​సిరీస్​లు, సినిమాలను విడుదల చేస్తున్నాయి. అయితే, టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో, అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​ వంటి ఓటీటీ ప్లాట్​ఫాం​లలో హై-డెఫినిషన్ వీడియోను అదే పనిగా చూడటం ద్వారా గణనీయంగా గ్రీన్​హౌస్​ వాయు ఉద్గారాలు వెలువడుతున్నాయని, ఇది భూమికి హాని కలిగిస్తుందని UKలోని ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.

స్మార్ట్​ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లలో చూసే ఎస్​డీ వీడియోల కంటే హెచ్‌డీ వీడియోలు ఎనిమిది రెట్లు ఎక్కువ ఉద్గారాలు విడుదల చేస్తాయని నివేదిక స్పష్టం చేసింది. దీని పర్యవసానంగా, భవిష్యత్తులో మానవాళికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అందువల్ల, వీడియో స్ట్రీమింగ్ రిజల్యూషన్‌ను తగ్గించాలని OTT ప్లాట్‌ఫారమ్‌లను, నియంత్రణ సంస్థలను కోరింది. వాతావరణంలో తలసరి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి SD క్వాలిటీ వీడియోలను మాత్రమే ప్రసారం చేయాలని ఆయా ఓటీటీ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న మొత్తం కార్భన్​ ఉద్గారాల్లో ఒక్క డిజిటల్ రంగం నుంచే 1.4 శాతం నుండి 5.9 శాతం వరకు వెలువడుతున్నాయని నివేదిక అంచనా వేసింది.

హెచ్​డీ వీడియోలతో అధిక మొత్తంలో CO2 విడుదల..
మాగ్జిమ్ ఎఫౌయి-హెస్ నిర్వహించిన మరో అధ్యయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌లలో 30 నిమిషాల పాటు హైడెఫినిషన్​ వీడియోలను చూడటం వల్ల వెలువడే కార్భన్​ ఉద్గారాలు.. 6 కిలోమీటర్ల మేర కారు నడపితే విడుదలయ్యే ఉద్గారాలతో సమానం అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. గత ఏడాది జర్మనీ ప్రభుత్వ సహకారంతో చేసిన మరో అధ్యయనంలో కూడా ఇదే విషయం బహిర్గతమైంది. డేటా సెంటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని లెక్కగట్టి ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలు అతి తక్కువ మొత్తంలో కార్భన్​ డయాక్సైడ్​ ఉద్గారాలను విడుదల చేస్తాయని, గంటకు 2 గ్రాముల ఉద్గారాలు మాత్రమే వెలువడుతాయని నివేదిక తేల్చి చెప్పింది. అదే, కాపర్​ కేబుల్స్​ ఉపయోగించడం ద్వారా రెట్టింపు మొత్తంలో ఉద్గారాలు ఉత్పత్తి అవుతాయని నివేదిక పేర్కొంది. అయితే, 3జి మొబైల్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా గంటకు 90 గ్రాముల కార్భన్​ డయాక్సైడ్ విడుదలవుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
Published by:Sambasiva Reddy
First published: