Home /News /technology /

STRANGE WEIRD AMAZING SCARY FUNNY WEBSITES THEY THROUGH AWAY YOUR BOREDOM ALL THE DAY NK

వామ్మో... ఇలాంటి వెబ్ సైట్లు కూడా ఉంటాయా? చిత్రం... విచిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Strange Websites : ఈ ప్రపంచంలో కోట్లాది వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి కొన్ని మీకోసం.

కొంతమందికి జీవితం బోర్ కొట్టేస్తుంది. ఒక్కోసారి సోషల్ మీడియా కూడా నచ్చదు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎన్ని ఉన్నా ఏదో తెలియని బోర్ కొడుతుంది. ప్రతీ నిమిషమూ భారంగా గడుస్తుంది. ఏం చేసినా నచ్చదు. అలాంటి సమయంలో వాళ్లకు ఎంతో కొంత ఉత్సాహం కలిగించే వెబ్‌సైట్లు కొన్ని ఉన్నాయి. వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపోతే, బోర్ నుంచీ రిలీఫ్ ఇస్తూ అవి కాస్త ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కసారైనా అలాంటి వెబ్ సైట్‌లోకి వెళ్లి రావాలని అనిపించేలా ఉంటాయవి. అలాంటి కొన్ని వెబ్‌సైట్లను ఇవాళ తెలుసుకుందాం. వీలైతే ఈ స్టోరీని ఎక్కువ మందికి షేర్ చేసి... వాళ్లకూ ఆ వెబ్‌సైట్లు తెలిసేలా చేద్దాం.

ఫ్రెష్ ఎయిర్ కావాలా : ఇదో చిత్రమైన వెబ్‌సైట్. ఇందులో ఓ వర్చువల్ ఫ్యాన్ ఉంటుంది. మనకు కావాల్సినంత ఫ్రీ, ఫ్రెష్ ఎయిర్ అందిస్తుంది. ఆ టేబుల్ ఫ్యాన్ కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది. అదేంటో చూడాలంటే ఈ సైట్‌లోకి వెళ్లండి. http://www.airfrais.eu/us

గతంలోకి ఛలో ఛలో : 1970ల్లో టీవీ ఎలా ఉంటుంది? ఏయే కార్యక్రమాలు వస్తాయి? వంటి వాటిని వర్చువల్ టీవీలో చూడొచ్చు. మీకు మీరుగా ఛానెల్స్ మార్చవచ్చు. సంవత్సరాలు కూడా మార్చేయవచ్చు. వాల్యూమ్ ఎడ్జస్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఆలా వెళ్లి చూసి మళ్లీ మన స్టోరీలోకి వచ్చేయండి. https://www.my70stv.com

క్లిక్ చేస్తే వాయింపే : ఇదో చెత్త వెబ్‌సైట్. లైఫ్ బోర్ కొట్టేవాళ్లకు మాత్రం నచ్చుతుంది. ఇందులో టైనీ ట్యూబా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే, ప్లే అవుతుంది. అంతకు మించి ఏమీ ఉండదు. http://tinytuba.com

ప్రెస్ చెయ్యండి... పేల్చేయండి : బోర్ నుంచీ బయటపడేసే సూపర్ వెబ్‌సైట్ ఇది. ఇందులో డిటొనేషన్ బటన్ క్లిక్ చేస్తే చాలు... కార్లు, భవనాలు, ఆయిల్ ట్యాంకర్లు ఏవైనా సరే పేలిపోవాల్సిందే. http://shitday.de

అదిగో భారీ సాలీడు : మీకు స్పైడర్ అండే భయమా. ఇళ్లలో సాలీళ్లను చూస్తే భయపడతారా. ఐతే, ఈ వెబ్‌సైట్ మీకు థ్రిల్ కలిగిస్తుంది. ఇందులో ఓ భారీ సాలీడు... పై నుంచీ కిందకు దూకుతుంది. కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చేస్తుంది. http://www.onemotion.com/flash/spider

ఫేస్ ఇంటరాక్టివ్ : ఇదో చిత్రమైన సైట్. ఇందులో ఓ లేడీ ఫేస్ ఉంటుంది. కళ్లు, ముక్కు, నోటిపై మౌస్‌తో క్లిక్ చేస్తే... హావభావాలు పలికిస్తుంది. కర్సర్‌ను ఎన్ని రకాలుగా కదపగలిగితే అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయి. http://www.alterfin.dds.nl/dominique/index.html

ప్లే ఏదైనా బోర్ పరారే : ఇదో అద్భుతమైన వెబ్‌సైట్. ఇందులో ఓ పిల్లి తబలా, పియానో ఇలా రకరకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించగలదు. మనం కీ బోర్డులో కీలను, నంబర్లనూ టైప్ చేస్తుంటే పిల్లి మ్యూజిక్ వినిపిస్తుంది. ఓ లుక్ వేసి రండి. https://bongo.cat

పిల్లితో కెలిడోస్కోప్ : ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి తెలిసినది కెలిడోస్కోప్. అలాంటిది పిల్లుల బొమ్మలతో కెలిడోస్కోప్ వెబ్‌సైట్ ఉంది. లేటెందుకు జస్ట్ ఓ లుక్ వేసి... మళ్లీ మన స్టోరీలోకి వచ్చేయండి. http://catleidoscope.sergethew.com

పిల్లితో పియానో : ఇది మరో రకం. ఇందులో పిల్లి... పియానో పట్టుకుని ఉంటుంది. ఆ పియానో కీలపై మనం కర్సర్‌తో క్లిక్ చేస్తూ ఉంటే, రకరకాల పిల్లు కూతలు వినిపిస్తాయి. పిల్లి నచ్చకపోతే... పక్కనున్న లిస్టులోంచీ వేర్వేరు పిల్లుల్ని మార్చుకునే సదుపాయం కూడా ఉందండోయ్. http://catcordion.sergethew.com

ఇలాంటి చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటిని అప్పుడప్పుడూ తెలుసుకుందాం. న్యూస్18 తెలుగుతో టచ్‌లో ఉండండి మరి.ఇవి కూడా చదవండి :

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి

విటమిన్ సి తగ్గితే... పొట్ట రావడం గ్యారెంటీ... బరువు తగ్గాలంటే ఈ పదీ తినండి మరి...

Health Tips : పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు...
Published by:Krishna Kumar N
First published:

Tags: BUSINESS NEWS, Information Technology, Online business, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు