కాస్త బరువు పెరిగినట్టు అనుమానం వచ్చిందంటే చాలు... ఎలాగైనా బరువు తగ్గాలని తెగ ఆలోచిస్తుంటారు. భోజనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డైట్ ఫాలో అవుతారు. జిమ్‌కు వెళ్తారు. టార్గెట్ బరువు తగ్గడమే. మరి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్స్ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. అదేంటీ? యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే బరువు ఎలా తగ్గుతారని డౌటా? మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడ్తాయి ఈ యాప్స్. మీరు ఎంత తింటున్నారో... ఎంత తినాలో... ఎప్పుడు తినాలో... ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలో అన్నీ ఈ యాప్స్‌లో తెలుసుకోవచ్చు. మరి బరువు తగ్గడానికి ఏఏ యాప్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
YAZIO... బరువు తగ్గడం మాత్రమే కాదు, కండలు పెంచుకోవడానికి మీకు పర్సనల్ ప్లాన్ డిజైన్ చేసివ్వడం ఈ యాప్ ప్రత్యేకత. ఇందులో మీరు మీల్ ప్లాన్ క్రియేట్ చేసుకోవచ్చు. కేలరీలు ట్రాక్ చేసుకోవచ్చు. ఇతర ఫిట్‌నెస్ యాప్స్‌కు సింక్ చేసుకోవచ్చు.
Fitbit... మీ నడక, మీరు చేసే పనులను బట్టి మీ ఫిట్‌నెస్‌ని ట్రాక్ చేసే యాప్ ఇది. ఇందులో మీ ఫుడ్‌ని స్కాన్ చేసి కేలరీలు లెక్కించొచ్చు. నీళ్లు తాగడం దగ్గర్నుంచి మీ నిద్ర వరకు మొత్తం ట్రాక్ చేస్తుంది.
Lose It... ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. మీ కేలరీల్ని పక్కాగా లెక్కిస్తుంది. మీ బరువును ట్రాక్ చేస్తుంది. మీ వయస్సు, బరువు, హెల్త్ గోల్స్ ఆధారంగా మీ వెయిట్ లాస్ ప్లాన్ డిజైన్ చేస్తుంది. మీరు రోజూ ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారో పక్కాగా లెక్కించుకోవచ్చు. మీ భోజనం ఫోటోలు తీసి అప్‌లోడ్ చేసినా, బార్‌కోర్డ్స్ స్కాన్ చేసినా కేలరీల లెక్క తెలుస్తుంది. ఇందులో యూజర్లు ఓ కమ్యూనిటీలా ఉంటారు కాబట్టి... వారంతా మీకు స్ఫూర్తిగా నిలుస్తారు.
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
Cron-O-Meter... వెయిట్‌లాస్ కోసం ఉపయోగపడే మరో యాప్ ఇది. మీ న్యూట్రీషియన్, ఫిట్‌నెస్, హెల్త్ డేటాను ట్రాక్ చేసి మీ బరువు తగ్గించడానికి సాయంచేస్తుంది ఈ యాప్. 50,000 ఆహార పదార్థాల డేటా బేస్ ఈ యాప్‌లో ఉంటుంది. మీ కేలరీలను కంట్రోల్ చేయడంతో పాటు రోజూ మీరు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోవచ్చు. మీ ప్రోగ్రెస్‌ని తెలియజేసే 'Trends' ఫీచర్ ఇందులో ఉంటుంది.
Calorie Counter app by FatSecret
Calorie Counter app by FatSecret... వెయిట్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడే యాప్ ఇది. మీరు ఏం తింటున్నారు, బరువు తగ్గేందుకు ఏం చేస్తున్నారో అన్నీ రికార్డ్ మెయింటైన్ చేయొచ్చు. యూజర్లు ఒకరితో మరొకరు ఇంటరాక్ట్ కావచ్చు. మీలాగా బరువు తగ్గాలనుకుంటున్నవారి గ్రూప్‌లో జాయిన్ కావచ్చు. అంతేకాదు... మీకు ఆరోగ్యాన్ని అందించే వంటకాల గురించీ సమాచారం ఉంటుంది. మీ ఫుడ్, ఎక్సర్‌సైజ్, వెయిట్ డేటాను షేర్ చేసేందుకు 'My Professionals' టూల్ ఉపయోగపడుతుంది.
Read this: Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
MyFitnessPal... ఇది కూడా మీ కేలరీలు లెక్కించడానికి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అసలు మీకు రోజూ ఎన్ని కేలరీలు అవసరమో, ఎంత తినాలో సూచిస్తుంది. ఇందులోని ఫిట్‌నెస్ టిప్స్, సక్సెస్ స్టోరీస్ మీ స్నేహితులతో షేర్ చేసుకునేందుకు మెసేజ్ బోర్డ్ ఉంటుంది.
Fooducate... మీరు సరుకులు కొనేందుకు వెళ్లినప్పుడు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ప్రొడక్ట్ బార్‌కోడ్ స్కాన్ చేస్తే పోషకాల సమాచారం తెలుస్తుంది. మీరు ఏ ప్రొడక్ట్స్ తీసుకోకూడదో సూచిస్తుంది.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా
Nokia 9 PureView: ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ... ఫీచర్లు ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fitness, Health Tips, Mobile App, Playstore, Women health