మీరు గూగుల్ లేటెస్ట్ డూడుల్ చూశారా? పెంపుడు శునకాన్ని పట్టుకున్నట్టుగా ఓ మొసలిని ఎత్తుకొని కనిపించే వ్యక్తి మిమ్మల్ని ఆశ్చర్యపర్చడం ఖాయం. ఆయనెవరో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన పేరు స్టీవ్ ఇర్విన్. ఆస్ట్రేలియాకు చెందిన వన్యప్రాణి పరిరక్షకుడు. ఫిబ్రవరి 22న స్టీవ్ ఇర్విన్ 57వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది. స్టీవ్ ఇర్విన్ పుట్టినరోజున డూడుల్‌తో గూగుల్ గౌరవించడానికి కారణం ఆయన చేసిన సేవలే. ఆయన ఆరో ఏట తల్లిదండ్రులు బాబ్, లిన్ ఇర్విన్ 11 అడుగుల కొండచిలువను గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పట్నుంచీ స్టీవ్ ఇర్విన్‌కు వన్యప్రాణులంటే ప్రేమ, ప్రాణం. ఆ తర్వాత ఇర్విన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో బీర్వా రెప్టైల్ పార్క్ ప్రారంభించారు. అలా వన్యప్రాణులతో ఇర్విన్‌కు అనుబంధం పెరిగింది.
Read this: WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?
స్టీవ్ ఇర్విన్ 9వ ఏటనే మొసళ్లతో ఆడుకున్నాడు. మొసళ్లను మచ్చిక చేసుకొని పట్టుకోవడంలో ఆరితేరాడు. అలా పర్యావరణవేత్తల దృష్టిని ఆకర్షించుకున్నాడు. మొసళ్లను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించేందుకు స్టీవ్ ఇర్విన్ సహకారం తీసుకున్నాయి అనేక సంస్థలు. అప్పట్నుంచీ స్టీవ్ ఇర్విన్‌ను 'క్రొకోడైల్ హంటర్' అని పిలుస్తుంటారు. మొసళ్లు మాత్రమే కాదు... ఎలాంటి ప్రమాదకరమైన, భయంకరమైన జంతువైనా మచ్చిక చేసుకోవడంలో స్టీవ్ ఇర్విన్ దిట్ట. వన్యప్రాణుల్ని చూసి భయపడే జనాలకు వాటిని దగ్గర చేయాలన్నదే స్టీవ్ ఇర్విన్ లక్ష్యం. యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, నాట్ జియో లాంటి ఛానెళ్లు జంతువులపై రూపొందించిన డాక్యుమెంటరీల్లో స్టీవ్ ఇర్విన్ సహకారం చాలా కీలకం. 'ది క్రొకడైల్ హంటర్' పేరుతో టీవీ షోలు కూడా వచ్చాయి. ఇర్విన్ తాబేలులో కొత్త జాతుల్ని కూడా కనిపెట్టాడు. వాటికి 'ఎల్సెయా ఇర్విని' అని పేరు పెట్టడం విశేషం. 2006లో ఓ సముద్రంలో నివసించే 'మంటా రే' ప్రాణుల అరుదైన ఫుటేజీ కోసం ప్రయత్నిస్తుండగా 'మంటా రే' ముల్లు గుండెల్లో కుచ్చుకొని స్టీవ్ ఇర్విన్ చనిపోయాడు. భయంకరమైన జంతువుల్ని మచ్చికచేసుకోవడంలో ఆరితేరిన స్టీవ్ ఇర్విన్ ఇలా దుర్మరణం చెందడం ఎంతోమందిని కలచివేసింది.
Read this: PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
జంతువులపై అధ్యయనంలో ఇర్విన్ చేసిన సేవల్ని గుర్తిస్తూ ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 22న జాతీయ వన్యప్రాణుల దినం నిర్వహిస్తోంది ఆస్ట్రేలియా. 2001లో సెంటెనరీ మెడల్ పురస్కారం స్టీవ్ ఇర్విన్‌కు దక్కింది. 2004లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి నామినేట్ కావడం మరో విశేషం. స్టీవ్ ఇర్విన్ మరణించిన తర్వాత పిల్లలతో కలిసి అతని భార్య టెర్రీ ఇర్విన్ జూను చూసుకుంటున్నారు. తన భార్య టెర్రీ ఇర్విన్‌ను స్టీవ్ ఇర్విన్ మొదటిసారి చూసింది జూలోనే. ఆమె కూడా స్టీవ్ ఇర్విన్ లాగా జంతు ప్రేమికురాలు. అంతేకాదు నవంబర్ 15న 'స్టీవ్ ఇర్విన్ డే'గా ప్రకటించడం మరో గౌరవం.
Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్
ఇవి కూడా చదవండి:
Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే
SBI Offer: హోమ్ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google Doodle