SBI Alert: ఈ 4 యాప్స్ ఇన్‌స్టాల్ చేయకండి... మీ ఫోన్‌లో ఉంటే డిలిట్ చేయండి

SBI Alert: ఈ 4 యాప్స్ ఇన్‌స్టాల్ చేయకండి... మీ ఫోన్‌లో ఉంటే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కస్టమర్లకు అలర్ట్. ఈ నాలుగు యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్‌తో ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ఒక్క క్లిక్‌తో లక్షలకు లక్షల రూపాయలు క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు చేయాలంటే ఒకట్రెండు గంటలు బ్యాంకులోనే గడపాల్సిన పరిస్థితి. కానీ స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత లావాదేవీలన్నీ (Online Transactions) క్షణాల్లో జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ యాప్స్‌తో భారీ లావాదేవీలు సైతం నిమిషాల్లో చేసేయొచ్చు. స్మార్ట్‌ఫోన్, అందులో యాప్స్‌తో బ్యాంకింగ్ లావాదేవీలు (Banking Transactions) ఈజీ అయిందో, రిస్కు కూడా అదే స్థాయిలో ఉంది. సైబర్ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. యూజర్లను ట్రాప్ చేసి వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. అకౌంట్ మొత్తం ఖాళీ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఈ మోసాలను అడ్డుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటోంది.

    Gas Cylinder Cashback Offer: గ్యాస్ సిలిండర్ ధర రూ.937... పేటీఎంలో రూ.900 క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా

    స్మార్ట్‌ఫోన్ యూజర్లు నాలుగు యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేయకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) హెచ్చరిస్తోంది. Anydesk, Quick Support, Teamviewer, Mingleview యాప్స్ చాలా డేంజర్. ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయంటే హ్యాకర్లు, నేరగాళ్లు మీ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడం చాలా సింపుల్. అందుకే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేయకూడదని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఒకవేళ ఇప్పటికే ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసినట్టైతే యూజర్లు వాటిని వెంటనే డిలిట్ చేయడం మంచిది.

    Business Idea: లక్షల్లో ఆదాయం కావాలా? ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా


    ఇదొక్కటే బ్యాంకింగ్ లావాదేవీలను టార్గెట్ చేస్తూ నేరగాళ్లు చేసే మోసాలు చాలా రకాలుగా ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచిస్తోంది. మీరు గిఫ్ట్స్ గెలిచారని, మీకు ప్రైజ్ వచ్చిందని నేరగాళ్లు నమ్మించి మీ డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పిన్ లాంటి వివరాలు తెలుసుకొని మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. అందుకే ఎవరికీ ఇలాంటి సున్నితమైన వివరాలు వెల్లడించకూడదని హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిబ్బంది కూడా ఇలాంటి వివరాలు అడగరని చెబుతోంది.

    Gmail Password: జీమెయిల్ పాస్‌వర్డ్ మార్చడం చాలా సింపుల్... ఈ స్టెప్స్ ఫాలో అవండి

    ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేసి, మెసేజ్ చేసి ఇలాంటి వివరాలు అడిగితే అప్రమత్తమవ్వాలి. మీ అకౌంట్ వివరాలు షేర్ చేయొద్దు. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దు. ఫేక్ బ్యాంక్ ఇమెయిల్ ఐడీస్‌కి రిప్లై ఇవ్వొద్దు. వెంటనే ఎస్‌బీఐ కాల్ సెంటర్ నెంబర్ 1800111109 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. 155260 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: