SBI offer: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 5 ఆఫర్స్ మీకోసమే

SBI offer: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 5 ఆఫర్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

SBI YONO Super Saving Days | ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త. భారీ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో 'యోనో సూపర్ సేవింగ్ డేస్' మళ్లీ మొదలైంది.

  • Share this:
    మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? గుడ్ న్యూస్. ఎస్‌బీఐ 'యోనో సూపర్ సేవింగ్ డేస్' ప్రకటించింది. గత మూడు నెలల్లో 'యోనో సూపర్ సేవింగ్ డేస్' పేరుతో ఆఫర్స్ ప్రకటించడం ఇది మూడో సారి. వరుసగా మూడు నెలలు 'యోనో సూపర్ సేవింగ్ డేస్' ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఆఫర్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. ఆఫర్ సేల్ మొదలైంది. ఆఫర్స్ ఏప్రిల్ 7 వరకు అందుబాటులో ఉంటాయి. తమ కష్టమర్లకు భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. గత నెలలో 4 నుంచి 7 వరకు 'యోనో సూపర్ సేవింగ్ డేస్' పేరుతో ఆఫర్స్ అందించడంతో ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. దీంతో మరోసారి ఈ సేల్ ద్వారా ఆఫర్స్ అందిస్తోంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, హెల్త్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి ప్రధాన కేటగిరీల్లో ఆఫర్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో 3.45 కోట్ల మంది యూజర్లకు ఆఫర్స్ అందిస్తోంది. ఇందుకోసం అమెజాన్, అపోలో, ఈజ్‌మైట్రిప్, ఓయో, @హోమ్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్‌బీఐ. మరి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో తెలుసుకోండి.

    JioFiber Free Trial: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ట్రై చేయండి

    Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే


    Amazon: మీరు అమెజాన్‌లో ఏమైనా కొనాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ యోనో ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయండి. 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    Apollo 24|7: మీరు ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ప్రొడక్ట్స్, చికిత్స కోసం మెడిసిన్ తీసుకోవాలనుకుంటున్నారా? అపోలోలో కొంటే 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

    @home: ఇంటికి ఫర్నీచర్ తీసుకోవాలనుకుంటున్నారా? @హోమ్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్స్‌కి ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. 12 శాతం అదనంగా తగ్గింపు పొందొచ్చు.

    Realme 8 Pro: రూ.17,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,499 ధరకే కొనండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

    Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?

    EaseMyTrip: ట్రావెల్ ప్లానింగ్స్ ఏవైనా ఉన్నాయా? ఈజ్‌మైట్రిప్ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ యోనో ద్వారా డొమెస్టిక్ ఫ్లైట్స్ బుక్ చేస్తే రూ.850 వరకు తగ్గింపు లభిస్తుంది.

    OYO: ఎక్కడైనా హోటల్ బుక్ చేయాలా? ఓయో నుంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లాట్ 50 శాతం తగ్గింపు పొందొచ్చు.

    ఈ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు యోనో ఎస్‍బీఐ యాప్ లేదా వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం లాగిన్ అయిన తర్వాత Shop & Order పైన క్లిక్ చేసి Super Saving Days పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: