HOME »NEWS »TECHNOLOGY »state bank of india sbi announced yono shopping festival from december 10 to december 14 ss

SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్

SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్‌బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI YONO Shopping Festival | ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్స్ అదనంగా 10% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.1000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశముంది.

  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యోనో కస్టమర్లకు శుభవార్త. 'యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0' ప్రకటించింది ఎస్‌బీఐ. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. భారీ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ పొందొచ్చు. ఈ ఫెస్టివల్‌లో ఎస్‌బీఐ యోనో కస్టమర్లకు 17 మర్చంట్ పార్ట్‌నర్స్ వేర్వేరు కేటగిరీల్లో 50% వరకు డిస్కౌంట్స్ పొందొచ్చు. అమెజాన్, లైఫ్‌స్టైల్ స్టోర్స్, థామస్ కుక్, ఈజ్ మై ట్రిప్, ఓయో లాంటి 17 ఇ-కామర్స్ మర్చంట్స్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ... ఇలా ఎందులో అయినా మీరు 5% నుంచి 50% వరకు డిస్కౌంట్స్ పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్స్ అదనంగా 10% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.1000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశముంది.

అంతేకాదు... హోమ్ లోన్, ఆటో లోన్స్ పైనా ఆఫర్లు ప్రకటించింది ఎస్‌బీఐ. 2019 డిసెంబర్ 31 వరకు ఆటో లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజ్ లేదు. ఇక హోమ్ లోన్లపై కన్సాలిడేట్ ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు ప్రకటించింది. ఇన్‌స్టంట్ ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ అందించనుంది. గతేడాది కూడా యోనో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించింది ఎస్‌బీఐ. ఆ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఇప్పుడు 'యోనో షాపింగ్ ఫెస్టివల్ 2.0' ప్రకటించింది ఎస్‌బీఐ.



Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:
Published by:Santhosh Kumar S
First published:December 05, 2019, 17:42 pm