SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్స్

SBI Amazon offers | రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసిన వారు 10% డిస్కౌంట్ రూ.1,500 వరకు పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై షాపింగ్ చేస్తే 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

news18-telugu
Updated: January 18, 2020, 5:52 PM IST
SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్స్
SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై అదిరిపోయే ఆఫర్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైంది. శనివారం ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 నుంచి 22 వరకు ఆఫర్స్ అందరికీ లభిస్తాయి. 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్'లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు యోనో యాప్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసేవారికి డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసిన వారు 10% డిస్కౌంట్ రూ.1,500 వరకు పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై షాపింగ్ చేస్తే 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.





ఇక యోనో ఎస్‌బీఐ నుంచి కొనుగోళ్లు జరిపేవారికీ ఆఫర్స్ ఉన్నాయి. యోనో యాప్‌తో బిల్ పేమెంట్ చేస్తే 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్+బోనస్ ఆఫర్ లభిస్తుంది. రూ.25,000 కన్నా ఎక్కువ కొంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ యోనో ద్వారా షాపింగ్ చేసినవారికి మాత్రమే. అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, బోనస్ ఆఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో క్రెడిట్ అవుతుంది. ఇలాంటి ఆఫర్ల గురించి యోనో ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయిన తర్వాత బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జనవరి 22 వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ ఇలా అన్ని కేటగిరీల్లో ఆఫర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

IRCTC: ఆ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేయొద్దంటున్న ఐఆర్‌సీటీసీ

మీ స్నేహితులకు అప్పు ఇస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు