SBI కస్టమర్లకు సూచన... పాస్ వర్డ్ ఇలా ఉండాలంటున్న బ్యాంక్...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఓ కీలక సూచన చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ విషయంలో ఈ సూచన చేసింది.

news18-telugu
Updated: May 10, 2020, 5:03 PM IST
SBI కస్టమర్లకు సూచన... పాస్ వర్డ్ ఇలా ఉండాలంటున్న బ్యాంక్...
ఎస్‌బీఐ లోగో
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఓ కీలక సూచన చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ విషయంలో ఈ సూచన చేసింది. ఈ మధ్యకాలంలో ప్రఖ్యాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. తన కుమారుడికి ఎలాన్ మస్క్ వెరైటీ పేరు పెట్టాడు ఎలాన్ మస్క్. ఆ పేరు X Æ A-12 Musk అని ఉంటుంది. దీన్ని చూసి చాలా మంది ఇదేం పేరు? ఇదే పేరా? అసలు దీన్ని ఎలా పిలుస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఎలన్ మస్క్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఇలాంటి సూచన చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు కూడా ఇలా చిత్ర విచిత్రంగా ఉండే వాటిని పాస్ వర్డ్‌లుగా పెట్టుకోవాలని సూచించింది. అయితే, అది కచ్చితంగా తమ కుటుంబసభ్యుల పేర్లు కాకూడదని తెలిపింది. ‘పాస్ వర్డ్‌లు స్ట్రాంగ్‌గా, పిల్లల పేర్లు వెరైటీగా ఉండాలని కోరుకుంటాం.’ అంటూ ఓ సందేశాన్ని ఇచ్చింది.



ఇక ఈ పేరును ఎలా పిలవాలంటే మొదటి అక్షరమైన X అని ఎలన్ మస్క్ తెలిపాడు. ఇక... నెక్ట్స్ ఉన్న Æ (AE) ని... యాష్ అని పలకాలట. ఇక ఈ పేరులోని A-12కి ప్రత్యేక అర్థం ఉందన్నాడు. ఈ A-12 ఎందుకు చేర్చారని రోగాన్ ప్రశ్నించగా... A-12 అనేది... ఆర్కాంజెల్ 12 (Archangel 12) అనీ... అది ప్రపంచంలో అత్యంత చల్లటి విమానం అని తెలిపాడు. మొత్తంగా ఈ పేరును ఎలా పలకాలంటే... "ఎక్సాషే ట్వల్వ్" అట. ఏమైతేనేం... ఈ పేరు మాత్రం... బేబీ బాయ్ నేమ్స్‌లో అరుదైన, చిత్రమైన పేరుగా నిలిచింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 10, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading