Home /News /technology /

SPOTIFY IS AVAILABLE IN INDIA ON MOBILE AND PC FOR RS 119 PER MONTH BUT LEGAL TROUBLES LOOM SS

Spotify: ఇండియాలో 'స్పాటిఫై' మ్యూజిక్ యాప్ రిలీజ్... విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Spotify Release | విదేశీ మార్కెట్‌లో స్పాటిఫైకి మంచి డిమాండ్ ఉంది. ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కూడా స్పాటిఫై కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.

    మ్యూజిక్ లవర్స్‌కు శుభవార్త. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ 'స్పాటిఫై' ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. 'స్పాటిఫై' స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్ ఉచితమే. కానీ మ్యూజిక్ క్వాలిటీలో పరిమితులు ఉంటాయి. 'స్పాటిఫై' సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఫీచర్లన్నీ వాడుకోవచ్చు. యాడ్స్ ఉండవు. మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక నెల ప్రీమియం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత రూ.119 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. విద్యార్థులకు మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇండియాలో స్పాటిఫై ఛార్జీలు ఇలా ఉన్నాయి.

    ఒక రోజు: రూ.13
    ఏడు రోజులు: రూ.39
    ఒక నెల: రూ.129
    మూడు నెలలు: రూ.389
    ఆరు నెలలు: రూ.719
    ఏడాది: రూ.1,189

    Read this: Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఉందా? బీమా ఎంత ముఖ్యం?

    spotify login, spotify app, spotify free, spotify web player login, spotify account, spotify premium, spotify playstore, Spotify India, Spotify Premium, స్పాటిఫై లాగిన్, స్పాటిఫై యాప్, స్పాటిఫై ఛార్జెస్
    (ప్రతీకాత్మక చిత్రం)

    స్పాటిఫై ఏంటీ?


    భారతదేశంలో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, జియో మ్యూజిక్, గానా, యాపిల్ మ్యూజిక్ లాంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా స్పాటిఫై వచ్చింది. విదేశీ మార్కెట్‌లో స్పాటిఫైకి మంచి డిమాండ్ ఉంది. ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కూడా స్పాటిఫై కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. భారతీయ మార్కెట్‌పై కన్నేసిన స్పాటిఫైకి కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వార్నర్ గ్రూప్‌తో వివాదం నడుస్తోంది.

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    spotify login, spotify app, spotify free, spotify web player login, spotify account, spotify premium, spotify playstore, Spotify India, Spotify Premium, స్పాటిఫై లాగిన్, స్పాటిఫై యాప్, స్పాటిఫై ఛార్జెస్
    (ప్రతీకాత్మక చిత్రం)

    ఇండియాలో స్పాటిఫై ఎలా ఉపయోగించాలి?


    మీ దగ్గర ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ ఉంటే మీరు యాప్ స్టోర్‌లోకి వెళ్లి స్పాటిఫై మ్యూజిక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా ఇమెయిల్‌తో సైనప్ చేయాల్సి ఉంటుంది. స్పాటిఫై ప్రీమియం కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

    Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'


    ఇవి కూడా చదవండి:

    Nokia 210: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర రూ.2,500 మాత్రమే

    Facebook Feature: త్వరలో ఫేస్‌బుక్‌లో 'క్లియర్ హిస్టరీ' ఫీచర్

    Indian Railways: భారతీయ రైల్వే లగేజీ రూల్స్ ఇవే...
    First published:

    Tags: Mobile App, MUSIC, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు