#SpotifyIndia: స్పాటిఫై మ్యూజిక్ యాప్‌... ఇండియాలో సంగీతప్రియులకు ఎందుకంత క్రేజ్?

Spotify India Launch | స్పాటిఫై ఇండియాకు రావడం మ్యూజిక్ లవర్స్‌కు అతిపెద్ద శుభవార్తే. భారతదేశంలో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, జియో మ్యూజిక్, గానా, యాపిల్ మ్యూజిక్ లాంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ చాలా ఉన్నాయి.

news18-telugu
Updated: March 4, 2019, 9:19 AM IST
#SpotifyIndia: స్పాటిఫై మ్యూజిక్ యాప్‌... ఇండియాలో సంగీతప్రియులకు ఎందుకంత క్రేజ్?
#SpotifyIndia: స్పాటిఫై మ్యూజిక్ యాప్‌... ఇండియాలో సంగీతప్రియులకు ఎందుకంత క్రేజ్?
news18-telugu
Updated: March 4, 2019, 9:19 AM IST
Spotify... ఇండియాలో ఇప్పుడు ఓ సెన్సేషనల్ మ్యూజిక్ యాప్. ఇప్పుడే కాదు... ఈ యాప్ కోసం ఏడాదిగా మ్యూజిక్ లవర్స్ ఎదురుచూస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ 2008లో ప్రారంభమైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు 80 దేశాలకు పైగా విస్తరించింది. 20 కోట్లకు పైగా యూజర్లు ఉంటే అందులో 9 కోట్ల మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లే. ఇప్పుడు స్పాటిఫై జాబితాలో ఇండియా కూడా చేరింది. ఫిబ్రవరి 26న స్పాటిఫై ఇండియాలో అధికారికంగా లాంఛైంది.

స్పాటిఫై ఇండియాకు రావడం మ్యూజిక్ లవర్స్‌కు అతిపెద్ద శుభవార్తే. భారతదేశంలో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, జియో మ్యూజిక్, గానా, యాపిల్ మ్యూజిక్ లాంటి మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అయినా స్పాటిఫై కోసం ఎదురుచూస్తున్నారు సంగీతప్రియులు. ఇప్పుడు మిగతా మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు పోటీగా స్పాటిఫై వచ్చింది. స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ ఇండియాలో లాంఛ్ చేయడంతో మ్యూజిక్ లవర్స్ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో ఇలా పంచుకున్నారు.




Loading...









'స్పాటిఫై' స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్ ఉచితమే. కానీ మ్యూజిక్ క్వాలిటీలో కొన్ని పరిమితులు ఉంటాయి. 'స్పాటిఫై' సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఫీచర్లన్నీ వాడుకోవచ్చు. యాడ్స్ ఉండవు. మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇండియాలో లాంఛింగ్ సందర్భంగా కొన్ని ఆఫర్లు ప్రకటించింది స్పాటిఫై. ఒక నెల ప్రీమియం ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత రూ.119 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. విద్యార్థులకు మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇండియాలో స్పాటిఫై ఛార్జీలు ఇలా ఉన్నాయి.

ఒక రోజు: రూ.13
ఏడు రోజులు: రూ.39
ఒక నెల: రూ.129
మూడు నెలలు: రూ.389
ఆరు నెలలు: రూ.719
ఏడాది: రూ.1,189

spotify login, spotify app, spotify free, spotify web player login, spotify account, spotify premium, spotify playstore, Spotify India, Spotify Premium, స్పాటిఫై లాగిన్, స్పాటిఫై యాప్, స్పాటిఫై ఛార్జెస్
(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియాలో స్పాటిఫై ఎలా ఉపయోగించాలి?


మీ దగ్గర ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్ ఉంటే మీరు యాప్ స్టోర్‌లోకి వెళ్లి స్పాటిఫై మ్యూజిక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా ఇమెయిల్‌తో సైనప్ చేయాల్సి ఉంటుంది. స్పాటిఫై ప్రీమియం కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు


ఇవి కూడా చదవండి:

PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు

LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు

FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ

 
First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...