Home /News /technology /

SPOTIFY FINALLY BRINGS REAL TIME LYRICS TO ALL USERS WORLDWIDE HOW TO USE NEW FEATURE JNK GH

Lyrics in Spotify: రియల్-టైమ్ లైవ్​ లిరిక్స్ ఫీచర్‌ను పరిచయం చేసిన స్పాటిఫై.. ఎలా యాక్సెస్ చేయాలంటే?

స్పాటిఫైలో అందుబాటులోకి వచ్చిన లైవ్ లిరిక్స్ ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)

స్పాటిఫైలో అందుబాటులోకి వచ్చిన లైవ్ లిరిక్స్ ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్ స్పాటిఫై (Spotify)లో లక్షల కొద్దీ పాటలు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సంగీత ప్రియులకు స్పాటిఫై ఫేవరెట్ యాప్‌గా మారిపోయింది. అయితే ఇందులో లైవ్ లిరిక్స్ (Live Lyrics) అనే ఫీచర్ లేకపోవడం వల్ల శ్రోతలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు.

ఇంకా చదవండి ...
ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ (Music Streaming) యాప్ స్పాటిఫై (Spotify)లో లక్షల కొద్దీ పాటలు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది సంగీత ప్రియులకు స్పాటిఫై ఫేవరెట్ యాప్‌గా మారిపోయింది. అయితే ఇందులో లైవ్ లిరిక్స్ (Live Lyrics) అనే ఫీచర్ లేకపోవడం వల్ల శ్రోతలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఈ ఫీచర్ సాయంతో పాట ప్లే అవుతుంటే దాని లిరిక్స్‌ని స్క్రీన్‌పై చూడొచ్చు. అన్ని ఇతర మ్యూజిక్ యాప్‌లు లైవ్ లిరిక్స్ ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చాయి. ఐతే ఎట్టకేలకు స్పాటిఫై కూడా తన యూజర్లందరికీ లైవ్ లిరిక్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈరోజు నుంచి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఉన్న యూజర్లకు రియల్ టైమ్ లిరిక్స్ (real-time lyrics) ఫీచర్ అందుబాటులో ఉంటుందని తాజాగా స్పాటిఫై ప్రకటించింది. మొబైల్, డెస్క్‌టాప్, కన్సోల్‌లు, సెలెక్ట్ స్మార్ట్ టీవీల ఉచిత లేదా ప్రీమియం యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందని వివరించింది.

రియల్ టైమ్ లిరిక్స్ ఫీచర్ తీసుకురావాల్సిందిగా చాన్నాళ్ల నుంచి స్పాటిఫై కమ్యూనిటీలో యూజర్లు అభ్యర్థనలు చేస్తున్నారు. స్వీడిష్ కంపెనీ అయిన స్పాటిఫై ఇప్పుడు మ్యూజిక్స్ మ్యాచ్ (Musixmatch)తో కలిసి యూజర్ల కోరిక తీరుస్తూ ఈ ఫీచర్‌ను అందరికీ విడుదల చేయడం ప్రారంభించింది. దాంతో ప్లే అవుతున్న స్క్రీన్‌పై పైకి స్వైప్ చేయడం (swiping up) ద్వారా యూజర్లు తమ మొబైల్‌లో లిరిక్స్ యాక్సెస్ చేయవచ్చు. ఒక పాట ప్లే చేశాక 'నౌ ప్లేయింగ్ వ్యూ(Now playing view)' స్క్రీన్ లో పైకి స్వైప్ చేయాలి. అలా చేయడం ద్వారా పాటకి అనుగుణంగా లిరిక్స్ కనిపిస్తుంది. పాట లిరిక్స్ అనేది సాంగ్ కొనసాగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా దానంతట అదే స్క్రోల్ అవుతూ ఉంటుంది. యూజర్లు సోషల్ మీడియా లేదా ఇతర థర్డ్-పార్టీ యాప్‌లలో కూడా లిరిక్స్ ని షేర్ చేసుకోవచ్చు. ఇందుకు లిరిక్స్ పేజీలో కనిపించే షేర్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. డెస్క్‌టాప్ యూజర్లు మైక్రోఫోన్ ఐకాన్ పై క్లిక్ చేసి పాటలు లిరిక్స్ చూడొచ్చు. స్పాటిఫై టీవీ యాప్ యూజర్లు లిరిక్స్ బటన్‌పై లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది.

Venkatesh Iyer-Undertaker: వెంకటేశ్ అయ్యర్ డబ్ల్యూడబ్ల్యూఈలో అండర్‌టేకర్ ఫ్యాన్.. అతడి కోరిక ఏంటో తెలుసా?


పాట ప్లే అవుతుంటే స్క్రీన్​పై లిరిక్స్​..

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ చివరకు స్పాటిఫై రిలీజ్ చేసింది కానీ కొన్ని సమస్యలను యూజర్లు ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌డీఏ (XDA) డెవలపర్‌లలోని నివేదిక ప్రకారం.. ఇప్పటివరకైతే కొన్ని పాటలు లిరిక్స్ ఫీచర్‌కు సపోర్ట్ చేయడం లేదు. లిరిక్స్ ఫీచర్‌కు సపోర్ట్ ఉందా లేదా అనే విషయాన్ని పాటలపై ట్యాగ్‌ల ద్వారా యాప్ తెలియజేస్తోంది. 2019లో లిరిక్స్ ఫీచర్‌ను మొదట పరీక్షించిన తర్వాత స్పాటిఫై గతేడాది నుంచి భారతదేశం, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో లిరిక్స్‌ను అందిస్తోంది. స్పాటిఫై సర్వీస్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ ఇప్పుడు విడుదల అవుతోంది. ఇంతకుముందు, స్పాటిఫై బిహైండ్ ది లిరిక్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది ఆర్టిస్టులు, లిరిక్స్ గురించి కొన్ని ఫన్ ఫాక్ట్స్ అందించేది. గత వారం, స్పాటిఫై ఇతరులను బ్లాక్ చేసేందుకు వీలుగా ఓ ఫీచర్‌ను లాంచ్ చేసింది. స్ట్రీమ్ మ్యూజిక్, పాడ్‌క్యాస్ట్‌లకు భద్రత, యూజర్లకు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ అందించేందుకు డైరెక్ట్ బ్లాకింగ్ ఫంక్షన్‌ను తీసుకొచ్చినట్లు స్పాటిఫై చెప్పింది
Published by:John Kora
First published:

Tags: Bollywood, Music, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు