2022లో చందమామపైకి స్టార్‌షిప్... స్పేస్‌ఎక్స్ న్యూ ప్లాన్స్

SpaceX : 2024లో చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలన్నది నాసా ప్లాన్. అందుకు తగినట్లుగా... వ్యోమగాములకు ఆహారం పంపేందుకు స్పేస్ ఎక్స్... 2022 నుంచే స్టార్‌షిప్‌ను పంపాలనుకుంటోంది.

news18-telugu
Updated: October 27, 2019, 12:08 PM IST
2022లో చందమామపైకి స్టార్‌షిప్... స్పేస్‌ఎక్స్ న్యూ ప్లాన్స్
2022లో చందమామపైకి స్టార్‌షిప్... స్పేస్‌ఎక్స్ న్యూ ప్లాన్స్
  • Share this:
SpaceX New Plan : 2019 ముగియబోతోంది. మరి వచ్చే ఏడాది ప్లాన్స్ ఏంటి అని అడిగితే... వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్పేస్‌ఎక్స్ కంపెనీ ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇప్పటివరకూ స్పేస్‌ఎక్స్... ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ రాకెట్లను తయారుచేస్తోంది. ఇవి అధిక పేలోడ్లను కలిగి ఉన్నాయి. వీటి ద్వారా సరుకులు, మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు పంపవచ్చు. ఐతే... స్పేస్‌ఎక్స్ ఈ రెండు రాకెట్లతోపాటూ... కొత్తగా ఓ స్టార్‌షిప్ తయారుచేస్తోంది. ఇది ఆ రెండు రాకెట్ల కంటే అత్యాధునికమైనది, వాటికి ప్రత్యామ్నాయం లాంటిది. వచ్చే ఏడాది చివరికి ఇది పూర్తవుతుంది. దీన్ని 2022 లోపు చందమామపైకి పంపాలన్నది స్పేస్‌ఎక్స్ ప్లాన్. ఈ స్టార్‌షిప్‌లో వ్యోమగాములకు కావాల్సిన సరుకుల్ని పంపిస్తారు. వాటిని చందమామపై స్టోర్ చేస్తారు. 2024లో అమెరికా అంతరిక్ష సంస్థ చందమామపైకి వ్యోమగాముల్ని పంపినప్పుడు... వాళ్లు అక్కడికి వెళ్లగానే... వాళ్లకు కావాల్సిన అన్ని ఐటెమ్సూ రెడీగా ఉంటాయన్నమాట.


స్పేస్‌ఎక్స్ పెట్టుకున్న గోల్ అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. నాసా, ఇస్రో లాంటి సంస్థలకే రాకెట్ల తయారీకి ఏళ్లు పడుతోంది. కానీ ఈ సంస్థ మాత్రం తన 6,500 మంది ఉద్యోగులతో నిరంతరం ఇదే పని చేయిస్తోంది. మరోవైపు నాసా తన పనిలో తాను బిజీగా ఉంది. 2014లో చందమామపైకి వ్యోమగాముల్ని పంపడంతోపాటూ... 2030 తర్వాత మార్స్ పైకి కూడా మనుషుల్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సో... వచ్చే పన్నెండేళ్లలో మనం సరికొత్త అంతరిక్ష ప్రయోగాల్ని చూస్తామన్నమాట. 

Pics : అందం, అభినయానికి కేరాఫ్ విద్యా ప్రదీప్
ఇవి కూడా చదవండి :

Video : ఛాలెంజ్... ఈ మిర్చి తిని ఏడవకుండా ఉండగలరా?

Pics : 3000 ఏళ్ల నాటి మమ్మీలు... చెబుతున్న కొత్త కథేంటి?

పునర్వవి దీపావళిని ఎవరితో జరుపుకుంటుందో తెలుసా...

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...
First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>