హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: భారీగా పెరగనున్న ట్విట్టర్ క్యారెక్టర్స్‌ లిమిట్..  280 నుంచి 4,000కు పెరిగే అవకాశం!

Twitter: భారీగా పెరగనున్న ట్విట్టర్ క్యారెక్టర్స్‌ లిమిట్..  280 నుంచి 4,000కు పెరిగే అవకాశం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అయ్యారు. ట్విట్టర్‌లో అనేక మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కొత్తగా బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌(Elon musk) ట్విట్టర్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువు అయ్యారు. ట్విట్టర్‌(Twitter)లో అనేక మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కొత్తగా బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ట్విట్టర్ క్యారెక్టర్స్‌ లిమిట్‌(Twitter character limit)ను భారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ట్విట్టర్ లిమిట్ 280 క్యారెక్టర్‌లు. ట్విట్టర్ యూజర్ తన ట్వీట్‌ను 280 క్యారెక్టర్స్‌లోపే ముగించాల్సి ఉంటుంది. తాజాగా ఈ లిమిట్‌ను మరింత పెంచనున్నారని, త్వరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు ఉన్నాయని సమాచారం.

లిమిట్ పెంపునకు మస్క్ ఓకే

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్‌ను 280 నుంచి 4,000 వరకు పెంచుతున్న విషయాన్ని మస్క్ ఇటీవల ధృవీకరించారు. ఓ ట్విట్టర్ యూజర్ మస్క్‌ను ట్వీట్ ద్వారా ఓ ప్రశ్న అడిగారు. ట్విట్టర్‌లో క్యారెక్టర్స్ లిమిట్‌ 280 నుంచి 4000కి పెంచడానికి మార్పులు చేస్తున్నారా? ఇది నిజమేనా? అని అడిగారు. దానికి మస్క్ ‘అవును’ అని ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు.

మొదట్లో 140 క్యారెక్టర్ లిమిట్‌

ట్విట్టర్ వాస్తవానికి 140 క్యారెక్టర్ లిమిట్‌తో ప్రారంభమైంది. గత కొన్నెళ్ల క్రితం ఈ లిమిట్‌ను 280 క్యారెక్టర్స్‌ వరకు పెంచారు. తాజాగా ఈ లిమిట్‌ను 4000 క్యారెక్టర్స్ వరకు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారీ సైజ్‌ ట్వీట్‌లను కూడా పోస్ట్‌ చేసే అవకాశం కలుగుతుంది.

యూజర్ల స్పందన

పలువురు ట్విట్టర్ యూజర్లు మస్క్ సమాధానంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓ ట్విట్టర్ యూజర్ తన ట్వీట్‌లో.. మస్క్ నిర్ణయం పెద్ద తప్పు అని అన్నారు. ట్విట్టర్ ముఖ్య ఉద్దేశం వేగంగా న్యూస్ అందించడమని, ఒకవేళ ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్ పెంచితే నిజమైన సమాచారం కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరొకరు ఓ ట్వీట్‌లో స్పందిస్తూ.. 4000 క్యారెక్టర్సా? అయితే అది వ్యాసం అవుతుంది, ట్వీట్ కాదు అని చెప్పారు.

India - China Tension : భారత్-చైనా సరిహద్దుల్లో టెన్షన్.. అరుణాచల్‌ప్రదేశ్‌పై కంబాట్ ఎయిర్ పాట్రోల్స్

ట్విట్టర్‌లో భారీ మార్పులు

క్యారెక్టర్స్‌ లిమిట్‌ పెంపు కారణంగా ట్విట్టర్‌ను మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పరిగణించవచ్చా అనే సందేహాలు తలెత్తున్నాయి. 4000 క్యారెక్టర్ వల్ల యూజర్లు సుదీర్ఘమైన పోస్ట్‌లను ట్వీట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుందని, దీంతో ఇది లింక్డ్‌ఇన్ తరహాలో ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ అసలు స్వరూపాన్ని పూర్తిగా మార్చాలని మస్క్ ఎందుకు భావిస్తున్నారో? అర్థం కావడం లేదని చాలా మంది యూజర్లు అంటున్నారు.

అందుబాటులోకి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్

ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ గత సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. యాపిల్ కస్టమర్లు ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్‌కు ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారి ప్రొఫైల్‌లో బ్లూ టిక్‌ కనపడుతుంది. కొత్తగా కనిపించే బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఎడిట్ ట్వీట్ ఫీచర్, 1080p రిజల్యూషన్‌తో వీడియోలను అప్‌లోడ్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. వెబ్ వెర్షన్‌పై ప్రైస్ ట్యాగ్ $8 (సుమారు రూ. 640) కాగా, ఐఫోన్ యూజర్లు అయితే $11 (సుమారు రూ. 880)చెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్ పేర్కొంది.

First published:

Tags: Elon Musk, Twitter