Home /News /technology /

SOON YOU COULD CHAT WITH YOUR DIGI AVATAR ON WHATSAPP VIDEO CALLS UMG GH

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. వీడియో కాల్స్‌లో లేటెస్ట్ అవతార్స్.. మాములుగా ఉండదు..!

వాట్సాప్

వాట్సాప్

వీడియో కాల్స్ కోసం డిజి అవతార్స్‌ (Digital Avatars)తీసుకొచ్చేందుకు సిద్ధమైంది వాట్సాప్. ఈ అవతార్స్‌ను వీడియో కాల్ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. వీడియో కాల్స్‌లో ఫేస్ లేదా డిస్‌ప్లే పిక్చర్ కనిపించకుండా ఈ డిజిటల్ అవతార్స్‌ ఉపయోగించవచ్చు.

ఇంకా చదవండి ...
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అలాగే కమ్యూనికేషన్ చేసే విధానాన్ని వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఎన్నో ఎమోజీలు, ఎమోజీ రియాక్షన్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా ఈ మెసేజింగ్ యాప్ వీడియో కాల్స్ కోసం డిజి అవతార్స్‌ (Digital Avatars)తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ అవతార్స్‌ను వీడియో కాల్ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. వీడియో కాల్స్‌లో ఫేస్ లేదా డిస్‌ప్లే పిక్చర్ కనిపించకుండా ఈ డిజిటల్ అవతార్స్‌ ఉపయోగించవచ్చు. వీడియో కాల్స్‌లో ప్రైవసీ కావాలనుకున్నవారు, అలాగే సరికొత్త రూపంలో భావాలను ఎక్స్‌ప్రెస్ చేయాలనుకునే యూజర్లకు అవతార్స్‌ బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి పరీక్షల దశలోనే ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

సరికొత్త అవతార్స్ అందుబాటులోకి వస్తే వీడియో కాల్ సమయంలో యూజర్లు ఎమోజీ లేదా బిట్‌మోజీ స్టైల్‌లో ఒక కస్టమ్ డిజిటల్ అవతార్‌కి మారిపోవచ్చు. ప్రస్తుతానికి వీడియో కాల్స్‌లో ఫేస్ చూపించకుండా కెమెరా ఆఫ్ చేసినప్పుడు ప్రొఫైల్ ఫొటో కనిపిస్తుంది. కానీ కొత్త ఫీచర్‌తో ప్రొఫైల్ ఫొటోకి బదులు డిజిటల్ అవతార్ కనిపిస్తుంది. ఈ అవతార్ మెమోజీ లాగా ఉండొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మెమోజీ వర్చువల్ అవతార్స్‌ ఇప్పటికే ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రతిబింబించే యానిమేటెడ్ మెమోజీని సృష్టించవచ్చు.

ఇదీ చదవండి: లాస్ట్ వర్కింగ్ డే నుంచి 2 రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలు.. కొత్త వేతన కోడ్ మార్గదర్శకాలు ఇవే..!


వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌కు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ పంచుకుంది. ఈ స్క్రీన్‌షాట్‌లో వీడియో కాల్ ఇంటర్‌ఫేస్ కింద "స్విచ్ టు అవతార్ (Switch To Avatar)" అనే బటన్ కనిపించిందే తప్ప ఈ అవతార్స్ ఎలా ఉంటాయనేది కనిపించలేదు. వాట్సాప్ డిజైనర్లు ఈ అవతార్స్ 2డీ రూపంలో తీసుకొస్తారా లేదా 3డీ రూపంలో తీసుకొస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.



మల్టీవర్స్ కోసం వాట్సాప్ మాతృ సంస్థ మెటా భారీ ప్లాన్స్ చేస్తోంది. ఈ ప్లాన్స్‌లో వర్చువల్ అవతార్‌లు ఒక పెద్ద భాగంగా ఉన్నాయి. ప్రతి ఇతర మెటా ప్రొడక్ట్ మాదిరిగానే వాట్సాప్, మెటా అవతార్‌లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవతార్ ఫీచర్ అవతార్‌లను క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేసే సెలెక్టెడ్ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లను లాంచ్ చేయడంలో వాట్సాప్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏదైనా ఫీచర్ వర్కవుట్ కాకపోతే దానిని రెగ్యులర్ యూజర్లకు రిలీజ్ చేయకుండానే శాశ్వతంగా నిలిపేసిన సందర్భాలున్నాయి. ఏదేమైనా వాట్సాప్ వీడియో కాల్స్‌లో వర్చువల్ అవతార్‌లు ఉపయోగించే కొత్త ఫీచర్ చాలా సరదాగా అనిపిస్తుంది. దీనిని త్వరలోనే లాంచ్ చేస్తే యూజర్లకు కావలసినంత ఫన్ దొరుకుతుంది.
Published by:Mahesh
First published:

Tags: New features, Smart phone, Tech news, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు