Home /News /technology /

SONY XPERIA 10 III LITE LAUNCHED WITH SNAPDRAGON 690 SOC OLED DISPLAY IP68 RATING MK GH

Sony Xperia: సోనీ ఎక్స్​పీరియా 10 III లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన 5జీ స్మార్ట్​ఫోన్​

(image: Sony)

(image: Sony)

సోనీ ఎక్స్​పీరియా 10 III లైట్ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 6 జీబీ/64 జీబీ వేరియంట్ జపాన్​లో JPY 46,800 (సుమారు రూ. 31,650) వద్ద లభిస్తుంది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ సోనీ నుంచి సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ ​స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. ప్రస్తుతం జపాన్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌.. ఎన్నో విభిన్న ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిస్​ప్లేతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 5జీ సపోర్ట్​తో వస్తున్న ఈ డివైజ్‌లో.. స్నాప్‌డ్రాగన్ 690 ఎస్​ఓసీ ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఓఎల్​ఈడీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ ధర

సోనీ ఎక్స్​పీరియా 10 III లైట్ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 6 జీబీ/64 జీబీ వేరియంట్ జపాన్​లో JPY 46,800 (సుమారు రూ. 31,650) వద్ద లభిస్తుంది. ఇది​ జపాన్​లోని Rakuten Mobile, IIJmio, Mineo, goo, nuro ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్​, బ్లూ, వైట్​, పింక్​ అనే నాలుగు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు

సోనీ ఎక్స్‌పీరియా 10 III లైట్ స్నాప్‌డ్రాగన్ 690 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది 6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ 6.0 -అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై పనిచేస్తుంది. దీనిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కూడా అందించింది.

ఎక్స్​పీరియా 10 III లైట్​లో 12 మెగాపిక్సెల్​ మెయిన్​ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో యూనిట్‌ కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కొరకు ప్రత్యేకంగా 8 MP కెమెరాను చేర్చింది. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,500 mAh బ్యాటరీతో వస్తుంది. 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్, యూఎస్​డీ టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను సంస్థ ఇందులో చేర్చింది. ప్రస్తుతానికి జపాన్​లో మాత్రమే విడుదలైన ఈ ఫోన్​ గ్లోబల్​ మార్కెట్​లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై సోనీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.
Published by:Krishna Adithya
First published:

Tags: Smartphones

తదుపరి వార్తలు