• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • SONY SMART TELEVISIONS SONY HAS RELEASED NEW SMART TVS WITH AMAZING FEATURES MK GH

Sony smart televisions: అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసిన సోనీ..ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు...

Sony smart televisions: అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసిన సోనీ..ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు...

4. ఒక ఏసీకి రూ.200 నుంచి రూ.1,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం కలిపి కనీసం 3 శాతం నుంచి 5 శాతం వరకు ధర పెరగొచ్చు. ఏసీలు మాత్రమే కాదు రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు టీవీలు కూడా కాస్ట్‌లీ కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

టెలివిజన్ మార్కెట్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సోనీ నుంచి కొత్త సిరీస్ టీవీలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆ సంస్థ శుక్రవారం భారత్‌లో X80J గూగూల్ టెలివిజన్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వేరియంట్లలో 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే టీవీలను రూపొందించారు.

  • Share this:
టెలివిజన్ మార్కెట్‌ విభాగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన సోనీ నుంచి కొత్త సిరీస్ టీవీలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆ సంస్థ శుక్రవారం భారత్‌లో X80J గూగూల్ టెలివిజన్ సిరీస్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వేరియంట్లలో 4K అల్ట్రా HD LED డిస్‌ప్లే టీవీలను రూపొందించారు. వీటిలో బ్రేవియా X80J 189 సెం.మీ (75 అంగుళాలు), 165 సెం.మీ (65 అంగుళాలు), 140 సెం.మీ (55 అంగుళాలు), 126 సెం.మీ (50 అంగుళాలు), 108 సెం.మీ (43 అంగుళాల) మోడళ్లు ఉన్నాయి. 4K HDR ప్యానెళ్లు, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఫీచర్లతో ఇవి లభిస్తున్నాయి. వినియోగదారులు గూగుల్ స్ట్రీమింగ్ సేవల నుంచి 7 లక్షలకు పైగా సినిమాలు, టీవీ ఎపిసోడ్లను బ్రౌజ్ చేయవచ్చు. ఈ మోడళ్లు గూగుల్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి టీవీల్లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్లు ఉంటాయి.

ఈ సిరీస్‌లో KD- 65X80J మోడల్‌ ధర రూ.1.30 లక్షల వరకు ఉంది. దేశంలోని అన్ని సోనీ సెంటర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. X80J సిరీస్‌లో 108 సెం.మీ (43 అంగుళాల) నుంచి 189 సెంటీమీటర్ల (75 అంగుళాల) కొత్త మోడళ్లను త్వరలో విడుదల చేస్తామని సోనీ ప్రకటించింది.

ఎన్నో కనెక్టివిటీ ఫీచర్లు
X80J సిరీస్‌లను మెరుగైన ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. డస్ట్, హ్యుమిడ్ ప్రొటెక్షన్ ఫీచర్లతో ఉండే ఈ టీవీలు సోనీ లైటెనింగ్ టెస్ట్‌లు పాస్ అయ్యాయి. అంటే ఉరుములు, మెరుపుల నుంచి, విద్యుత్ సరఫరా లోపాల నుంచి వీటికి రక్షణ లభిస్తుంది. సోనీ X80 సిరీస్ టీవీలు X1 4K HDR పిక్చర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ టీవీల్లో యాపిల్ హోమ్ కిట్, ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. వీటి సాయంతో కస్టమర్లు తమ యాపిల్ డివైజ్‌లను సోనీ టీవీతో అనుసంధానం చేసి బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

మెరుగైన సౌండ్, పిక్చర్ క్వాలిటీ
సోనీ X80J టీవీల్లో 4K డేటాబేస్ ఉంటుంది. దీని సహాయంతో 2K, ఫుల్ HDలో తీసిన ఇమేజ్‌లను కూడా సోనీ టీవీల్లో 4K రిజల్యూషన్‌లోకి మార్చుకోవచ్చు. వీటిలో ఉండే TRILUMINOS ప్రో డిస్‌ప్లే.. పిక్చర్ క్వాలిటీని మెరుగుపరిచి చూపిస్తుంది. X80J సిరీస్‌లో X- బ్యాలెన్స్‌డ్ స్పీకర్ ఫీచర్ ఉంటుంది. ఇది సౌండ్ క్వాలిటీని కూడా మెరుగుపరుస్తుంది. ఇది చూసేవారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.
First published:

అగ్ర కథనాలు