Video: టీ-షర్ట్‌లో ఏసీ... రోజంతా చల్లదనం... సోనీ సరికొత్త ఆవిష్కరణ

Sony Reon Pocket AC | స్మార్ట్‌ఫోన్‌తో డివైజ్‌ని కంట్రోల్ చేయొచ్చు. టెంపరేచర్‌ను కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు... చలికాలంలోనూ 'రియాన్ పాకెట్' ఏసీని ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: July 26, 2019, 12:58 PM IST
Video: టీ-షర్ట్‌లో ఏసీ... రోజంతా చల్లదనం... సోనీ సరికొత్త ఆవిష్కరణ
టీ-షర్ట్‌లో ఏసీ... రోజంతా చల్లదనం... సోనీ సరికొత్త ఆవిష్కరణ
  • Share this:
టెక్నాలజీ పెరిగిపోతోంది. టెక్నాలజీ సాయంతో అవసరాలన్నీ సులువుగా తీరిపోతున్నాయి. కొత్తకొత్త డివైజ్‌లు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతోనే 'రియాన్ పాకెట్' పేరుతో చిన్నసైజ్ ఎయిర్ కండీషనర్ తయారు చేసింది సోనీ కంపెనీ. జర్నీలో ఉన్నప్పుడు లేదా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఏసీ లేకపోతే 'రియాన్ పాకెట్' ఏసీ వాడుకోవచ్చు. వేసవిలో ఎంతగానే ఉపయోగపడుతుంది ఈ చిన్న ఏసీ. సోనీ చేపట్టిన క్రౌడ్‌ఫండింగ్ ప్రాజెక్ట్ ఇది. పవర్ బ్యాంక్ సైజ్‌లో 'రియాన్ పాకెట్' ఏసీ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీషర్ట్ ఉంటుంది. టీషర్ట్‌లోని పాకెట్‌లో 'రియాన్ పాకెట్' ఏసీని పెట్టుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో డివైజ్‌ని కంట్రోల్ చేయొచ్చు. టెంపరేచర్‌ను కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు... చలికాలంలోనూ 'రియాన్ పాకెట్' ఏసీని ఉపయోగించుకోవచ్చు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చగా ఉండేలా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సోనీ రియాన్ పాకెట్ ఏసీ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.

కారు లేదా వైన్ కూలర్స్‌లో ఉపయోగించే టెక్నాలజీతో పాకెట్ ఏసీని రూపొందించింది సోనీ. 'రియాన్ పాకెట్' ఎయిర్ కండీషనర్‌తో స్మాల్, మీడియం, లార్జ్ సైజ్‌ల టీషర్ట్స్ వస్తాయి. ప్రస్తుతానికి పురుషుల కోసం మాత్రమే ఈ డివైజ్‌ని రూపొందిస్తోంది సోనీ. లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 2 గంటలు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా ఉపయోగించుకోవచ్చు. సోనీ రియాన్ పాకెట్ ఏసీ ధర సుమారు రూ.8,990. దీంతో ఓ టీషర్ట్ వస్తుంది. ఒకవేళ డివైజ్‌తో పాటు ఐదు టీషర్ట్స్ కావాలంటే రూ.12,000 చెల్లించాలి. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ కేవలం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

Location: మీ లొకేషన్ షేర్ చేయడానికి 4 టిప్స్
Loading...
Govinda App: ఈ యాప్ ఉంటే తిరుమలలో దర్శనం, రూమ్ బుక్ చేయడం ఈజీ...

WhatsApp Status: వాట్సప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండి ఇలా...
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...