ఒకప్పుడు సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్ఫోన్లకు క్రేజ్ ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సాంసంగ్, ఒప్పో, వివో, షావోమీ, రియల్మీ లాంటి కంపెనీల ఆధిపత్యం మొదలైంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పట్టు సాధించేందుకు సోనీ కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్గా అదిరిపోయే ఫీచర్స్‌తో ఏకంగా మూడు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. సోనీ ఎక్స్‌పీరియా 1 III, సోనీ ఎక్స్‌పీరియా 5 III మోడల్స్‌ని రిలీజ్ చేయడంతో పాటు సోనీ ఎక్స్‌పీరియా 10 III మోడల్ని ప్రకటించింది. సోనీ ఎక్స్‌పీరియా 1 III, సోనీ ఎక్స్‌పీరియా 5 III స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. మూడు స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసిన సోనీ... ధరల్ని మాత్రం ప్రకటించలేదు. త్వరలో వీటి ప్రైసింగ్ తెలిసే అవకాశం ఉంది.
సోనీ ఎక్స్‌పీరియా 1 III స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల 4కే ఓలెడ్ హెచ్డీఆర్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 256జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ + 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ హైబ్రిడ్ స్లాట్
కలర్స్: ఫ్రోస్టెడ్ బ్లాక్, ఫ్రోస్టెడ్ పర్పుల్
Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా
WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే
సోనీ ఎక్స్‌పీరియా 5 III స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 256జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ + 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ హైబ్రిడ్ స్లాట్
కలర్స్: బ్లాక్, గ్రీన్, పింక్
Find My Device: స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
సోనీ ఎక్స్‌పీరియా 10 III స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 690
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ హైబ్రిడ్ స్లాట్
కలర్స్: బ్లాక్, బ్లూ, వైట్ పింక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Sony