హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Sony Bravia: సోనీ కొత్త ఆండ్రాయిడ్‌ టీవీ వచ్చేసింది... ధర, ఫీచర్ల వివరాలివే

Sony Bravia: సోనీ కొత్త ఆండ్రాయిడ్‌ టీవీ వచ్చేసింది... ధర, ఫీచర్ల వివరాలివే

Sony Bravia: సోనీ కొత్త ఆండ్రాయిడ్‌ టీవీ వచ్చేసింది... ధర, ఫీచర్ల వివరాలివే
(image: Sony)

Sony Bravia: సోనీ కొత్త ఆండ్రాయిడ్‌ టీవీ వచ్చేసింది... ధర, ఫీచర్ల వివరాలివే (image: Sony)

Sony Bravia | సోనీ మరిన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంఛ్ చేసింది. వాటి ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

స్మార్ట్ ఆండ్రాయిడ్‌ టీవీల విభాగంలో సోనీ కొత్త సిరీస్‌ను లాంఛ్ చేసింది. సోనీ బ్రేవియా ఎక్స్ 75 పేరుతో రిలీజ్‌ చేసిన ఈ సిరీస్‌లో అల్ట్రా హెచ్‌ హెచ్‌డీఆర్‌ టీవీలను అందించనున్నారు. ఇందులో రెండు రకాల మోడళ్లు ఉంటాయి. 43 అంగుళాలు, 50 అంగుళాల సైజులో టీవీలు తీసుకొస్తున్నారు. సోనీ బ్రేవియా ఎక్స్ 75లో 3840X2160 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ ఉన్న స్క్రీన్‌ ఉంటుంది. దీని హై రిఫ్రెష్‌ రేట్‌ 60 హెర్జ్‌. హెచ్‌డీఆర్‌ 10, హెచ్‌ఎల్‌జీ ఫార్మాట్స్‌కు సపోర్టు చేస్తుంది. దీంతో ఉత్తమ శబ్ద నాణ్యత కోసం డాల్బీ ఆడియో సాంకేతికత వినియోగిస్తున్నారు. ఈ టీవీల్లో సోనీ ఎక్స్‌1 4కె హెచ్‌డీఆర్‌ ప్రాసెసర్‌ వినియోగిస్తున్నారు. ఇందులో బిల్ట్‌ ఇన్‌ క్రోమ్‌ కాస్ట్‌ ఉంటుంది. గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్టు కూడా ఉంది. ఈ టీవీలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఇస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌ సపోర్టు కూడా ఉంటుంది. దాంతో ప్లే స్టోర్‌లోని యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Postinfo: పోస్ట్ ఆఫీస్‌కు వెళ్తుంటారా? అయితే ఈ యాప్ మీకోసమే

టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ లాంటి వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు ముందుగానే డౌన్‌లో అయి ఉంటాయి. అమెజాన్‌ ఎకో, గూగుల్ హోం డివైజ్‌లకు ఈ టీవీని కనెక్ట్‌ చేసి ఆపరేట్‌ చేయొచ్చు. అంటే ఆ స్మార్ట్‌ అసిస్టెంట్‌లకు చెప్పి టీవీలో మీకు కావాల్సిన సర్వీసులను చూసుకోవచ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీని కి ఇయర్‌ ఫోన్‌ పెట్టుకోవచ్చు. లేదంటే ఆడియో డివైజ్‌కు కనెక్ట్‌ చేయొచ్చు. ఇందులో బ్లూటూత్‌ సదుపాయం కూడా ఉంది.

WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి

ధర ఎంత?


ప్రముఖ ఈ- కామర్స్‌ పోర్టళ్లు, ఆఫ్‌లైన్‌ స్టోర్లు, సోనీ సెంటర్లు, మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్లలో ఈ టీవీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 43 అంగుళాల టీవీ ధర ₹66,900 కాగా, 50 అంగుళాల టీవీ ధర 84,900. అయితే 43 అంగుళాల టీవీని ₹59,990కి, 50 అంగుళాల టీవీని ₹72,990కి అమ్ముతున్నారు. ఇవి ప్రారంభ ఆఫర్‌ ధర అని తెలుస్తోంది. సుమారు ఇదే స్పెసిఫికేషన్లతో మార్కెట్‌లో ఉన్న చాలా టీవీల ధర వీటి కంటే తక్కువే. అయితే సోనీ బ్రాండ్‌ వాల్యూ బట్టి ఈ టీవీల అమ్మకాలు బాగానే ఉండొచ్చు అని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు.

First published:

Tags: Android TV, Smart TV, Sony

ఉత్తమ కథలు