హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Sony Camera: యూట్యూబర్ల కోసం తేలికైన కెమెరాను విడుదల చేసిన సోనీ

Sony Camera: యూట్యూబర్ల కోసం తేలికైన కెమెరాను విడుదల చేసిన సోనీ

Sony Camera: యూట్యూబర్ల కోసం తేలికైన కెమెరాను విడుదల చేసిన సోనీ

Sony Camera: యూట్యూబర్ల కోసం తేలికైన కెమెరాను విడుదల చేసిన సోనీ

Sony a7C Full-Frame Mirrorless Camera | సోనీ a7C 30fps వద్ద 4K రిజల్యూషన్‌ వీడియోలను తీయగలదు. కానీ ఇది వీడియో సెంట్రిక్ మిర్రర్‌లెస్ కెమెరా కాదు. ఇది ఆల్ రౌండ్ బ్యాలెన్స్డ్ ఫీచర్లతో లభిస్తున్న మెయిన్ స్ట్రీమ్ కెమెరా.

సోనీ మరో కొత్త కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసింది. A7 సిరీస్‌లోని కెమెరాలకు భిన్నంగా కనిపించే మొట్టమొదటి ఫుల్ ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా ‘Sony a7C’ను భారత మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. సోనీ నుంచి గతంలో వచ్చిన క్రాప్ సెన్సార్ APS-C మిర్రర్‌లెస్ కెమెరా మాదిరిగానే తాజా a7C కనిపిస్తోంది. ఇది ప్రపంచంలోనే తేలికైన, చిన్న ఫుల్ ఫ్రేమ్ కెమెరా అని సోనీ పేర్కొంది. పరిమాణంలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కెమెరాలో 24.2 మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్ బ్యాక్-ఇల్యూమినేటెడ్ CMOS సెన్సార్ ఉంది. ఇది సెన్సార్ షిఫ్ట్-బేస్డ్ 5-యాక్సిస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కలిసి పనిచేస్తుంది. సోనీ a7 IIIలో ఉండే బయోన్జ్ ఎక్స్ ఇమేజ్ ప్రాసెసర్‌ ఈ కెమెరాలోనూ ఉంది. ఇది ప్రాసెసింగ్ స్టాక్, బఫర్ తగినంత వేగంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. రియల్ టైమ్ ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌, స్టిల్స్ కోసం యానిమల్ ఐ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది. 10fps, AF/AE ట్రాకింగ్‌తో ఒకేసారి 39 ఫ్రేమ్‌ల కంప్రెస్డ్ RAW, JPEG ఫోటోలను ఈ కెమెరా తీయగలదు. ఈ ఫీచర్‌ లైవ్ యాక్షన్ స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్‌ ఫొటోగ్రఫీలపై ఆసక్తి ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.

WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి

Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

వీడియోలు కూడా తీయగలదు


సోనీ a7C 30fps వద్ద 4K రిజల్యూషన్‌ వీడియోలను తీయగలదు. కానీ ఇది వీడియో సెంట్రిక్ మిర్రర్‌లెస్ కెమెరా కాదు. ఇది ఆల్ రౌండ్ బ్యాలెన్స్డ్ ఫీచర్లతో లభిస్తున్న మెయిన్ స్ట్రీమ్ కెమెరా. రికార్డ్ చేసిన వీడియోలను కలర్ గ్రేడ్ ప్రాధాన్యతకు తగ్గట్టు ప్రాసెస్ చేయడానికి సహాయపడే S-Log, HLG LUT ఆప్షన్‌లు దీంట్లో ఉన్నాయి. కాంపాక్ట్ కెమెరాలో 8-బిట్ 4K వీడియో అవుట్‌పుట్‌ లభించడం విశేషం. వీడియోగ్రాఫర్‌ల కోసం ఆకర్షణీయమైన సెకండ్ కిట్ కెమెరా ఉంటుంది. కొత్తగా వీడియోగ్రఫీ నేర్చుకునేవారికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది.

Dual Selfie Camera Phones: సెల్ఫీ కోసం రెండు కెమెరాలు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే

అత్యాధునిక ఫీచర్లు


సోనీ a7Cలోని ప్రామాణిక ISO, ISO 100కు మించి ఉంటుంది. ఇది డైనమిక్ పరిధిని సూచిస్తుంది. స్పీడ్ లైట్లు, బూమ్ మైక్‌ల కోసం మల్టీ ఇంటర్‌ఫేస్ హాట్ షూను కూడా ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్ వ్యూఫైండర్ అవసరం లేదు. సోనీ a7C కెమెరా 100 శాతం ఫ్రేమ్ కవరేజ్ వద్ద 2.36 మిలియన్-డాట్ రిజల్యూషన్ OLED వ్యూఫైండర్ను అందిస్తుంది. ఇది మూడు అంగుళాల టచ్‌స్క్రీన్ LCD మానిటర్‌తో లభిస్తుంది. కానీ 921 కె-డాట్ రిజల్యూషన్ వినియోగదారులను కొంచెం నిరుత్సాహపర్చవచ్చు. ఈ కెమెరాలో CIPA- సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 740 స్టిల్స్‌ తీసుకోవచ్చు. ఇన్ని అత్యాధునిక ఫీచర్లు ఉన్న సోనీ a7C కెమెరా(body-only) ధర రూ.1.68 లక్షలు. ప్రస్తుతం 28-60mm f/4-5.6 స్టాండర్డ్ జూమ్ కిట్‌ లెన్స్‌పై మాత్రమే ఆఫర్ ఉంది. ఈ లెన్స్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి విడిగా కూడా అమ్మనున్నారు. కిట్ ధర రూ.1.97 లక్షలు. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ కెమెరా లభిస్తుంది.

First published:

Tags: Photography, Sony

ఉత్తమ కథలు