హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? మీ అకౌంట్ ఖాళీ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ 7 పనులు చేయండి

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? మీ అకౌంట్ ఖాళీ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ 7 పనులు చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Smartphone Tips | స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ఎవరైనా కంగారుపడతారు. ఫోన్ పోగానే వెంటనే ఈ 7 పనులు చేయడం మర్చిపోవద్దు.

స్మార్ట్‌ఫోన్... ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించే గ్యాడ్జెట్. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, మెసేజెస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతీ అవసరానికి ఈ గ్యాడ్జెట్ వాడాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకు లావాదేవీల దగ్గర్నుంచి ఆన్‌లైన్ మీటింగ్స్ వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే. దీంతో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర అకౌంట్ల లాగిన్ వివరాలన్నీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో స్మార్ట్‌ఫోన్ పోయిందంటే ఇక టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే స్మార్ట్‌ఫోన్ పోగానే కంగారుపడకుండా కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వివరాలను ఇతరులు దుర్వినియోగం చేయకుండా అప్రమత్తం కావాలి. మరి స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ఏమేం చేయాలో తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ముందుగా చేయాల్సిన పని సిమ్ కార్డ్ బ్లాక్ చేయడం. మీరు మీ టెలికాం సర్వీస్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సిమ్ బ్లాక్ చేయమని చెప్పాలి. సిమ్ బ్లాక్ చేస్తే ఓటీపీలు ఫోన్‌కు రావు. కాబట్టి ఎవరైనా లావాదేవీలు చేద్దామని ప్రయత్నించినా అడ్డుకోవచ్చు. సిమ్ కార్డ్ బ్లాక్ చేసిన తర్వాత కొత్త సిమ్ కార్డు తీసుకోవాలి.

WhatsApp: వాట్సప్‌లో మరో రెండు కొత్త ఫీచర్స్... ఇలా వాడుకోవచ్చు

Realme Narzo 30 4G: కాసేపట్లో రియల్‌మీ నార్జో 30 సేల్... డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫోన్ నెంబర్ బ్యాంకు అకౌంట్లకు లింక్ అయి ఉంటే మీరు బ్యాంకుకు కాల్ చేయాలి. మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలని కోరాలి. బ్యాంకుకు వెళ్లి మీ అకౌంట్‌కు వేరే మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. మీ అకౌంట్ పాస్‌వర్డ్ మొత్తం మార్చేయాలి. మీ ఫోన్ కాజేసినవాళ్లు బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసినా లావాదేవీలు చేయలేరు. ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న యూపీఐ అకౌంట్లను కూడా డీయాక్టివేట్ చేయాలి.

మీరు ఫైండ్ మై డివైజ్ లాంటి సేవల్ని యాక్టివేట్ చేసినట్టైతే ఆ సర్వీస్ ద్వారా మీ ఫోన్‌లోనే డేటాను మొత్తం డిలిట్ చేయాలి. మీ ఫోన్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, ఫోటోలు, వీడియోలు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.

ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఆధార్డుకు వేరే మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ల ద్వారా మీ ఆధార్ వివరాలు సేకరించడం సులువు. అందుకే వెంటనే ఆధార్ సెంటర్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... రోజూ 3జీబీ డేటా

Mi 11 Lite: కాసేపట్లో ఎంఐ 11 లైట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్... డిస్కౌంట్ వివరాలు ఇవే

గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నట్టైతే ఆ సంస్థల కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మొబైల్ వ్యాలెట్స్‌ని బ్లాక్ చేయించాలి.

ఫేస్‌బుక్, జీమెయిల్ లాంటి అకౌంట్లకు మీ ఫోన్ నెంబర్ లింక్ అయినట్టైతే వెంటనే ఆ అకౌంట్ సెట్టింగ్స్‌లో కూడా మొబైల్ నెంబర్ మార్చాలి.

ఇక సమీపంలోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీ స్మార్ట్‌ఫోన్ పోయినట్టు కంప్లైంట్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరైనా డబ్బులు కాజేసినా ఎఫ్ఐఆర్ కాపీ సాక్ష్యంగా ఉంటుంది.

First published:

Tags: Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones

ఉత్తమ కథలు