Home /News /technology /

SOLAR STORM MASSIVE ERUPTION ON THE SUN GEOMAGNETIC STORM TO HIT EARTH ON THURSDAY GH VB

Solar Storm: సూర్యుడిపై భారీ విస్ఫోటనం.. గురువారం భూమిని తాకనున్న జియోమాగ్నెటిక్‌ స్ట్రోమ్‌..? వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భూమిపై జీవరాశికి మూలమైన సూర్యుడి ఉపరితలంపై కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. సోలార్‌ సైకిల్‌లో (Solar Cycle) పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతుండటంతో సూర్యుడి వేడి అంతకంతకూ పెరుగుతున్నట్లు గుర్తించారు.

భూమిపై జీవరాశికి మూలమైన సూర్యుడి ఉపరితలంపై కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. సోలార్‌ సైకిల్‌లో (Solar Cycle) పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతుండటంతో సూర్యుడి వేడి అంతకంతకూ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగా సూర్యుడి ఉపరితలంపై కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (CME-Caronal Mass Ejection) అనే విస్ఫోటనం ఏర్పడిందని, అది భూమి(Earth) వైపు ప్రయాణిస్తోందని వివరించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ గురువారం భూమిని తాకుతుందని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్(Sciences) విభాగం పేర్కొంది.

కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది సూర్యుని ఉపరితలంపై సంభవించే అతిపెద్ద విస్ఫోటనాలలో ఒకటి. ఇది ఒక బిలియన్‌ టన్నుల పదార్థాన్ని కలిగి ఉంటుంది. అంతరిక్షంలో గంటకు అనేక మిలియన్ మైళ్ల వేగంతో పప్రయాణించగలుగుతుంది. ఈ సౌర పదార్థం ఇంటర్‌ప్లానెటరీ మాధ్యమం ద్వారా ప్రవహిస్తుంది. దాని మార్గంలో ఏదైనా గ్రహం లేదా శాటిలైట్లు అడ్డువచ్చినా ప్రభావితం చేస్తుంది.

Demat Account: డీమాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్లకు అలర్ట్.. ఇలా చేయకుంటే అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం..


భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
వాస్తవానికి బలమైన కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (CME) భూమిని దాటినప్పుడు.. అది మన ఉపగ్రహాలలోని ఎలక్ట్రానిక్‌ వస్తువులను దారుణంగా దెబ్బతీస్తుంది. భూమిపై రేడియో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. మార్చి 28న సూర్యునిపై 12975, 12976 రీజియన్‌ల నుంచి సౌర మంటలు విడుదలయ్యాయి. ఈ మంటలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకితే కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రేరిత మోస్తరు భూ అయస్కాంత తుపానులు వచ్చే అవకాశం ఉందని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ తెలిపింది.

దీనికి సంబంధించి చేసిన ఓ ట్వీట్‌లో.. ‘మేము తెలుసుకొన్న సమాచారం మేరకు.. మార్చి 31న 496 నుంచి 607 కి.మీ/సె వేగంతో భూమిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విస్ఫోటాలను ఉత్పత్తి చేయగల కొత్త సన్‌స్పాట్‌లను సూర్యుని ఉపరితలంపై కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ గుర్తిస్తోంది. AR12975, AR12976లు అయస్కాంత తత్వంతో అనుసంధానమై ఉన్నాయి. M/X క్లాస్ ఫ్లేర్ ప్రొడక్టివ్‌గా గగుర్తించడం కొనసాగుతుంది. X క్లాస్ ఫ్లేర్‌ను ఉత్పత్తి చేయడానికి సహేతుకమైన అవకాశాలతో.. AR 12978 కూడా ఇప్పుడు ఫ్లేర్ పాజిటివ్‌గా ఫ్లాగ్ చేస్తున్నాం.’ అని పేర్కొంది.

Survey On AC, Fan: మీ ఇంట్లో ఏసీ, ఫ్యాన్ ఉందా..? ఇలా చేస్తే కరెంటు బిల్లు ఆదా అవుతుంది..!


నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)లోని యూఎస్‌ ఆధారిత స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ కూడా ఈ పరిశీలనను ధ్రువీకరించింది. G3 తరగతి బలమైన భూ అయస్కాంత తుపాను మార్చి 31న భూమిని తాకుతుందని అంచనా వేసింది. ఉపగ్రహ భాగాలపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది. భూమికి తక్కువ ఎత్తులోని కక్షల్లో సంచరిస్తున్న ఉపగ్రహాలపై కూడా తీవ్రత కనిపిస్తుంది. అడపాదడపా ఉపగ్రహ నావిగేషన్‌, తక్కువ-ఫ్రీక్వెన్సీ రేడియో నావిగేషన్ సమస్యలు సంభవించవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Science and technology, Trending, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు