హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Telangana : పౌష్టికాహారం కోసం పొలం బాట పట్టిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మహర్షి -2

Telangana : పౌష్టికాహారం కోసం పొలం బాట పట్టిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. మహర్షి -2

(రైతే రాజు)

(రైతే రాజు)

Organic farming: సాంప్రదాయం, ఆధునికత మేళవింపుగా వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చని నిరూపించారు ఇద్దరు యువ రైతులు. ఉన్నతమైన విద్యను అభ్యసించి..మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత పూర్తి స్ధాయి రైతులుగా మారిపోయారు. ఎంబీఏ, టీటీసీ చేసిన ఇద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...

(Syed Rafi, News18,Mahabubnagar)

సాంప్రదాయం, ఆధునికత మేళవింపుగా వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చని నిరూపించారు ఇద్దరు యువ రైతులు. ఉన్నతమైన విద్యను అభ్యసించి..మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత పూర్తి స్ధాయి రైతులుగా మారిపోయారు. ఎంబీఏ చేసిన ఆకుల జగన్‌Akula jagan), టీటీసీ పూర్తి చేసిన ఆంజనేయులు(Anjaneyulu) అనే మరో విద్యావంతుడు సేంద్రియ వ్యవసాయం(Organic farming)పైన దృష్టి పెట్టారు. అందులో లోటుపాటలను పూర్తిగా అధ్యయనం చేసి మోడ్రన్ రైతులుగా పేరు తెచ్చుకున్నారు. ఆరోగ్యవంతమైన కూరగాయల్ని పండిస్తూ వాటిని ఆన్‌లైన్‌(Online)లో డోర్‌ డెలవరీ చేస్తున్నారు.

రైతుగా మారిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ ..

హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో స్థిరపడిన ఆకుల జగన్‌ తన సోదరుడు నిరంజన్‌తో కలిసి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోని పల్లి గ్రామ శివారులో 44 ఎకరాలు భూమి కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. జగన్‌ ఎంబీఏ చదివిన జగన్ గత 20ఏళ్లుగా సాఫ్ట్‌వేర్, టెలికాం రంగంలో మంచి ఉద్యోగాలు చేశాడు. జగన్‌ తల్లి క్యాన్సర్ బారినపడటంతో వైద్యులను సంప్రదించాడు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడిన ఆహారం, కూరగాయలు తీసుకోవడం వల్లే కారణమని వైద్యులు చెప్పడంతో ఉద్యోగం కంటే వ్యవసాయం చేయడం సరైన మార్గమని భావించాడు. అంతే సేంద్రియ రైతు సర్వదమన్ పటేల్ గుజరాత్‌లో నిర్వహించిన బైక్ కాక కృషి కేంద్ర సంస్థలో ట్రైనింగ్‌ తీసుకున్నాడు జగన్. సేంద్రియ సాగుకు అవసరమయ్యే ప్రతి విషయాన్ని క్షణ్ణంగా తెలుసుకున్న తర్వాత సాగురంగలోకి అడుగుపెట్టాడు.

ఆరోగ్యమే మహాభాగ్యం కదా..

సేంద్రియ వ్యవసాయం చేయాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తిస్థాయి గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. టమాటా ఆకుకూరలతో పాటు అన్నీ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు ఐదు గ్రీన్ జాతి ఆవులు పెంచుతున్నారు. ఐదు ఆవులు రోజు ఇచ్చే 30 లీటర్ల పాలను అమ్మకుండా నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నాడు. మజ్జిగ పులియబెట్టి అవసరాన్ని బట్టి వివిధ పదార్థాలు కలిపి చీడపీడల నివారణకు పిచికారి చేస్తున్నారు రైతు జగన్.

ఇది చదవండి: సత్ఫలితాలు ఇస్తున్న మెట్ట వరి సాగు: నల్లగొండ జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుఒక ఐడియా సాగు విధానాన్నే మార్చింది..

ప్రస్తుతం స్విగ్గి అమెజాన్ ఫ్లిప్ కార్డ్ వంటి సంస్థలు నగరాల్లో కూరగాయలు డోర్‌ డెలవరీ చేస్తున్నట్లుగానే రైతు జగన్ కూడా తాను పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, ఆకు కూరల్ని ఆన్లైన్ వేదికగా ఏర్పాటుచేసి హైదరాబాద్ నగర ప్రజలకు అమ్ముతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా .akula organics.storeపేరుతో వెబ్‌సైట్‌, యాప్‌ను ఏర్పాటు చేసుకున్నారు జగన్. వెస్ట్, సెంట్రల్ హైదరాబాద్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్థిరపడిన ప్రాంతాలకు తాను పండిస్తున్న సేంద్రియ కూరగాయలు సప్లై చేస్తూ వారి ఆరోగ్యవంతులుగా ఉంచేదుకు దోహదపడుతున్నాడు. అయితే రోజూ ఈ విధంగా కూరగాయలు సప్లై చేయడం కూదరదని గ్రహించి వారంలో బుధవారం, శనివారాలు మాత్రమే సేంద్రియ కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. ఆ రెండ్రోజుల్లో ఉదయం 10 గంటల వరకు కనీసం మినిమమ్ 499 రూపాయల విలువ చేసే ఆర్డర్స్ తీసుకొని రాత్రి 8గంటల సమయంలో మధ్యలో సరఫరా చేస్తున్నాడు. ఈ విధంగా తనకు నెలకు 800 ఆర్డర్స్ వస్తున్నట్లు రైతు జగన్‌ చెబుతున్నాడు.

ఇది చదవండి : హైదరాబాద్‌లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు వాళ్లకే ..ఎప్పుడంటేఆన్‌లైన్‌లో సేంద్రియ కూరగాయలు..

ఆరోగ్యకరమైన ఆహారం పదార్ధాలు తినాలనే సంకల్పంతో జగన్‌ సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టడం మిగిలిన వారికి స్పూర్తిదాయకంగా మారింది. అందుకే ఇదే జిల్లాకు చెందిన మరో ఉన్నత విద్యావంతుడు ఆంజనేయులు సైతం టీటీసీ చదివి సాగుపై మక్కువ పెంచుకున్నారు. తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. అయితే ఈ ఆధునిక సాగు విధానం, ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉన్నప్పటికి రైతులకు పెద్దగా లాభాలు రావడం లేదు. కూలీలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పోయి డబ్బులు మిగలాలంటే కనీసం రెండు వేల ఆర్డర్లు వస్తే బాగుంటుందంటున్నాడు. ఆదిశగానే తాము పూర్తిస్తాయిలో మార్కెటింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నాడు.

First published:

Tags: Mahabubnagar, Organic Farming

ఉత్తమ కథలు