SOCIAL NETWORKING GIANT FACEBOOK ALLOW TO USERS HIDE LIKES SA GH
Facebook , Instagram: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా.. ఈ ఆప్షన్ మీ కోసమే!
ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే
(ప్రతీకాత్మక చిత్రం)
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్టు చూసినప్పుడు దానికి ఎన్ని లైక్‌లు వచ్చాయనేది చూస్తాం. అయితే త్వరలో మీరు అన్ని పోస్టులకు లైక్‌లు కౌంట్ చూడలేరు. అయితే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పూర్తిగా తీసేయడం లేదు.
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్టు చూసినప్పుడు దానికి ఎన్ని లైక్‌లు వచ్చాయనేది చూస్తాం. అయితే త్వరలో మీరు అన్ని పోస్టులకు లైక్‌లు కౌంట్ చూడలేరు. అయితే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పూర్తిగా తీసేయడం లేదు. తమ పోస్టులకు వచ్చే లైక్‌ల సంఖ్య ఇతరులకు కనిపించాలా? వద్దా అనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. అంటే మీరు ఒక పోస్టు పెట్టినప్పుడు... దానికి వచ్చే లైకుల కౌంట్ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్లకు కనిపించాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ఫేస్బుక్ చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో లైక్‌లు చూసి అవే ట్రెండింగ్‌లో ఉన్నాయని కొందరు అనుకుంటారు. అలాగే ఆ పోస్టులు పెట్టినవారు చాలా పాపులర్ ఏమో అని అనుకుంటారు. ఇంకొందరైతే ఎంత మంచి పోస్టు పెట్టినా లైక్‌లు రావడం లేదని ఇంకొందరు బాధపడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికే ఈ హైడ్ లైక్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. దాంతోపాటు తమ పోస్టుల విషయంలో యూజర్లకు అదనపు కంట్రోల్ ఇవ్వాలనుకోవడం కూడా ఒక కారణమని చెప్పుకొచ్చింది. దీంతోపాటు మరికొన్ని కంట్రోల్స్‌ను కూడా యూజర్ చేతికి ఇవ్వబోతోంది ఫేస్బుక్.
లైక్‌లు హైడ్ చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లో పోస్ట్స్ అనే సెక్షన్లోకి వెళ్లాలి. అందులో ‘లైక్’ ఆప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి లైక్‌లు హైడ్ చేయాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు. లేదంటే ప్రతి పోస్టు చేసేటప్పుడు అక్కడ ‘లైక్ హైడ్’ ఆప్షన్‌ను ఇస్తారు. అక్కడి నుంచి కూడా హైడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు అఫెన్సివ్ కంటెంట్ తగ్గించడం కోసం ఫేస్బుక్ కొత్త ఫిల్టర్స్‌ను తీసుకొస్తోంది. అలాగే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌లో ఏమేం చూడాలనేది యూజరే నిర్ణయించుకోవచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని కంట్రోల్స్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫేస్బుక్ ప్రకటించింది. దీని కోసం థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవడానికీ సిద్ధం అని తెలిపింది. దీని కోసం కొంత ఫండింగ్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలో ఇటీవల ఫేస్బుక్... మన దేశంలోని యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్ అనే సంస్థతో టై అప్ అయ్యింది. ఈ కలయికలో కౌంటర్ స్పీచ్ ఫెలోషిప్‌ను ప్రారంభించింది. క్రియేటివిటీ ఉన్న యువతను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. విజువల్ స్టోరీ టెల్లింగ్ సాయంతో యువతకు ఉపయోగపడే ఉత్తమమైన కన్వర్జేషన్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో లింగ సమానత్వం, మానసిక సమస్యలు తదితర కీలక అంశాలు చర్చించబోతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.