పాక్‌లో ఆగిపోనున్న ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సేవలు

సోషల్ మీడియాను నియంత్రించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలపై సోషల్ మీడియా సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ కఠిన నిబంధనలను పున:సమీక్షించని పక్షంలో పాకిస్థాన్‌లో తమ సేవలను ఆపేస్తామని హెచ్చరిస్తున్నాయి.

news18-telugu
Updated: March 1, 2020, 10:13 PM IST
పాక్‌లో ఆగిపోనున్న ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సేవలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియాను నియంత్రణలో పెట్టేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని కఠిన నిబంధనలతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా తమ కార్యాలయాలను, డేటా సర్వర్లను ఇస్లామాబాద్‌లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. పాకిస్థాన్ ఖాతాదారుల సమాచారాన్ని అక్కడి సర్వర్స్‌లో స్టోర్ చేసి, అధికార యంత్రాంగం కోరినప్పుడు దాన్ని వారితో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే సంస్థలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే వాటి సేవలను దేశంలో పూర్తిగా రద్దు చేస్తామని పాక్ ప్రభుత్వం హెచ్చరించింది.

సోషల్ మీడియాను నియంత్రిస్తూ పాక్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలపై పలు అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. దీంతో ఆ దేశంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటోంది. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు ఒకే గొడుకు కిందకు వచ్చాయి.  ఈ మార్గదర్శనాలను పున:సమీక్షించని పక్షంలో ఆ దేశంలో తమ సేవలను నిలిపివేస్తామంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ తదితర సంస్థలు హెచ్చరించాయి. ఈ విషయమై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాసిన ఆసియా ఇంటెర్నెట్ కూటమి(ఏఐసీ)...సోషల్ మీడియాపై విధించిన కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను ఎత్తివేయాలని కోరింది. లేని పక్షంలో పాక్‌లోని వినియోగదారులు, వ్యాపారవేత్తలకు తమ సేవలను కొనసాగించడం కష్టతరమవుతుందని స్పష్టంచేసింది.

పాక్ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు వ్యక్తిగత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ అంతర్జాతీయ హక్కుల సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సోషల్ మీడియాను నియంత్రించే యోచనను పాక్ ప్రభుత్వం విరమించుకోవాలని సూచిస్తున్నాయి.
First published: March 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading