SOCH Hackathon: ఓ ఐడియా.. మీ, మా జీవితాన్నే మార్చేస్తుంది

రుషికొండ ఇన్నోవేషన్ వ్యాలీలోని ఐటీ సెజ్ లో అంతర్జాతీయ స్ధాయి సన్ రైజ్ ఓపెన్ ఛాలెంజ్ హ్యాకథాన్ ప్రారంభమైంది. 30 గంటల పాటు జరిగే ఈ మేథో మథనంలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 175 టీమ్ లు హాజరయ్యాయి.

news18-telugu
Updated: February 2, 2019, 9:37 PM IST
SOCH Hackathon: ఓ ఐడియా.. మీ, మా జీవితాన్నే మార్చేస్తుంది
సోచ్ హ్యాకథాన్ (Image:@Sochhak/Twitter)
  • Share this:
వనరుల నిర్వహణలో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపుతూ ముందుకు వచ్చే యువతకు విశాఖ నగరం వేదికైంది. రుషికొండ ఇన్నోవేషన్ వ్యాలీలోని ఐటీ సెజ్ లో అంతర్జాతీయ స్ధాయి సన్ రైజ్ ఓపెన్ ఛాలెంజ్ హ్యాకథాన్ ప్రారంభమైంది. 30 గంటల పాటు జరిగే ఈ మేథో మథనంలో ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 175 టీమ్ లు హాజరయ్యాయి. వ్యవసాయం, తాగునీరు, స్మార్ట్ పైప్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు విశ్వవ్యాప్తంగ మేథోమథనం సాగుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సన్ రైజ్ ఓపెన్ ఛాలెంజ్ హ్యాకథాన్ లో వివిధ దేశాలు భాగస్వాములవుతున్నాయి.

సోచ్ హ్యాకథాన్ (Image:@Sochhak/Twitter)


గత నెల 27, 28 తేదీల్లో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో జరిగిన ఫస్ట్ లెగ్ హ్యాకధాన్ తర్వాత మన దేశంలోని విశాఖ నగరంలో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో సెకండ్ లెగ్ నిర్వహిస్తున్నారు. ఈ హ్యాకథాన్ లో వివిధ రంగాలకు చెందిన విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్దేశిత రంగాల్లో తమ అభిప్రాయాలను, ఆవిష్కరణలను ఇతరులతో పంచుకున్నారు.  విద్యార్ధుల్లో పోటీ తత్వాన్ని పెంచే విధంగా నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్ కు ఆతిధ్యం ఇవ్వడంపై విశాఖ ఇన్నోవేషన్ వ్యాలీ సీఈవో వినీత్ పాత్రో సంతోషం వ్యక్తంచేశారు.

సోచ్ హ్యాకథాన్ ‌లో పాల్గొన్న యువత (Image:@Sochhak/Twitter)
సోచ్ హ్యాకథాన్ ‌లో పాల్గొన్న యువత (Image:@Sochhak/Twitter)




30 గంటల పాటు సాగే ఈ హ్యాకథాన్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులను విజేతలుగా ఎంపిక చేయనున్నారు. ఈ హ్యాకథాన్ ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం వరకూ సాగనుంది.

ఇవి కూడా చదవండి

First published: February 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...