SNAPCHAT GOOD NEWS FOR SNAPCHAT USERS ANOTHER EXCITING FEATURE AVAILABLE EVK
SnapChat: స్నాప్‌చాట్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి!
ప్రతీకాత్మక చిత్రం
Snap Chat | ఇటీవల బాగా పాపులర్ సోషల్ మీడియా (Social Media) యాప్ స్నాప్‌చాట్. కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను బాగా ఆకట్టుకొంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది స్నాప్‌చాట్. ఈ ఫీచర్ (Feature) లో ఫొటో షేరింగ్ వేదిక స్నాప్ చాట్ ఇకపై చుట్టు పక్కల ప్రముఖ హోటళ్లను గుర్తించొచ్చు.
ఇటీవల బాగా పాపులర్ సోషల్ మీడియా (Social Media) యాప్ స్నాప్‌చాట్. కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ను బాగా ఆకట్టుకొంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది స్నాప్‌చాట్. ఈ ఫీచర్ (Feature) లో ఫొటో షేరింగ్ వేదిక స్నాప్ చాట్ ఇకపై చుట్టు పక్కల ప్రముఖ హోటళ్లను గుర్తించొచ్చు. ఇందుకోసం హోటళ్లను సమీక్షించే ది ఇన్‌ఫ్యాచ్యుయేషన్ వెబ్సైట్ (Website)తో స్నాప్‌చాట్ చేతులు కలిపింది. దీంతో స్నాప్‌చాట్ వెబ్సైట్ సమీక్షలను ప్లేస్ ప్రొఫైల్‌లో చూడటానికి వీలవుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా 50 పట్టణాల్లో అం దుబాటులో ఉంటుంది.
అంతే కాకుండా వినియోగదారులు తమ రియల్ టైమ్ (Real Time) లొకేషన్‌ను 15 నిమిషాలు లేదా కొన్ని గంటల పాటు స్నేహితులతో షేర్ చేసుకునేందుకు స్నాప్‌చాట్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇంటికి లేదా మరెక్కడైనా వెళుతున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుందని సంస్థ చెబుతుంది.
"తాత్కాలిక లొకేషన్ షేరింగ్‌తో మీరు, మీ స్నేహితులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకోండి" అని స్నాప్‌చాట్ శుక్రవారం ఆలస్యంగా ఒక ట్వీట్లో పోస్ట్ చేసింది. ఈ ఫీచర్ iOSలోని Find My యాప్‌ను పోలి ఉంటుంది. యాప్‌లో పరస్పర స్నేహితుల మధ్య మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఏదైన ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.
అంతే కాకుండా స్నాప్ చాట్ గత సంవత్సరం మ్యాప్ మీద లేయర్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌లో స్నాప్‌చాట్‌లో స్నేహితును గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను విస్తృత పరుస్తూ స్థానిక హోటళ్లను గుర్తించేలా మార్చింది. ఈ ఫీచర్‌ను స్నాప్ మ్యాప్‌పై కుడివైపు మూలన ఉండే మెనూ ద్వారా ద ఇన్ఫ్యా చ్యు యేషన్ గుర్తును తాకితే హోటళ్ల సమీక్షలు కనిపిస్తాయి. తమకు ఇష్టమైన హోటళ్లను చాట్ ద్వారా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా వెళ్లటానికి వీలుగా తమ ఫేవరెట్స్ ఫీచర్లో ఈ హోటళ్లనూ యాడ్ చేయొచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.