స్నేహితుల పుట్టినరోజును గుర్తు చేసే అద్భుతమైన ఫీచర్​ వచ్చేసింది.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి..

ప్రతీకాత్మక చిత్రం

పాపులర్​ కంటెంట్​ షేరింగ్​ యాప్​ షేర్​ చాట్ (Share Chat)​ కొత్త ఫీచర్లు (New Features) జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. భారత్​లో టిక్​ టాక్​ (Tiktok) బ్యాన్​ చేసిన తర్వాత షేర్​ చాట్​ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్లను విడుదల చేస్తుంది. షేర్​ చాట్​ తాజాగా ‘బర్త్​డేస్ మినీ’ అనే కొత్త ఫీచర్​ను జోడించింది. వివరాలిలా..

  • Share this:
పాపులర్​ కంటెంట్​ షేరింగ్​ యాప్​ షేర్​ చాట్ (Share Chat)​ కొత్త ఫీచర్లు (New Features) జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. భారత్​లో టిక్​ టాక్​ (Tiktok) బ్యాన్​ చేసిన తర్వాత షేర్​ చాట్​ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్లను విడుదల చేస్తుంది. షేర్​ చాట్​ తాజాగా ‘బర్త్​డేస్ మినీ’ అనే కొత్త ఫీచర్​ను జోడించింది. దీని ద్వారా యూజర్లు తమ స్నేహితుల పుట్టినరోజును సులభంగా ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు స్నేహితులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు, బర్త్‌డే మెసేజ్‌లు పంపవచ్చు. మీ పుట్టిన రోజు నాడు స్నేహితుల నుంచి బర్త్​ డే విషెస్​ పొందవచ్చు. ఈ ఫీచర్​ మీ ఫ్రెండ్​ లిస్ట్​లో ఉన్న వారి రాబోయే పుట్టినరోజు వివరాలను తెలియజేస్తుంది. వారి పుట్టినరోజు తేదీ దగ్గరపడుతుంటే మీకు అలర్ట్​ ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీ స్నేహితుల పుట్టినరోజును ట్రాక్ చేయడంతో పాటు, మీ సొంత పుట్టిన రోజుకి కౌంట్‌డౌన్ కూడా సెట్​ చేసుకోవచ్చు. తద్వారా ఎప్పటికప్పుడు మీ స్నేహితుల పుట్టినరోజు తేదీని స్నాప్​చాట్​ (Snap Chat) గుర్తుచేస్తుంది.

Young man arrested: షేర్ చాట్ లో వివాహిత ఫోన్ నంబర్.. నిత్యం వందల ఫోన్లు.. విషయం తెలుసుకున్న భర్త..


ఇందుకోసం యూజర్లు ముందుగా వారి ప్రొఫైల్​లో పుట్టినరోజు తేదీ, వయసు వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా ప్రొఫైల్​లో నమోదు చేసుకున్న స్నేహితుల వివరాలను మాత్రమే స్పాప్​చాట్​మీకు తెలియజేస్తుంది. అయితే స్పాప్​చాట్​ మీ స్నేహితులకు కేవలం పుట్టిన తేదీని మాత్రమే చూపిస్తుంది. పుట్టిన సంవత్సరం లేదా వయస్సు వంటి వివరాలను ఇతరులకు కనిపించవని పేర్కొంది. ఈ వివరాలు కేవలం మీరు మాత్రమే చూడగలుగుతారు.

అవతలి వ్యక్తి చూడలేరు. ఈ కొత్త ఫీచర్​కు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. "స్నాప్‌చాట్ యూజర్లు తమ స్నేహితుల పుట్టినరోజులను సులభంగా గుర్తుంచుకోవడానికి, జరుపుకోవడానికి బర్త్​డేస్ మినీ ఫీచర్​ను ప్రారంభించాం. ఈ ఫీచర్​ ద్వారా మీరు మీ స్నేహితుల నుండి శుభాకాంక్షలు, పుట్టినరోజు సందేశాలను పొందవచ్చు’ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి..
ఈ సరికొత్త ఫీచర్‌ సెప్టెంబర్ 9 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లు ఈ ఫీచర్‌ని ఆస్వాదించవచ్చని స్నాప్​చాట్​ తెలిపింది. చాట్‌లోని రాకెట్ ఐకాన్ వెనుక ఈ ఫీచర్​ను చూడవచ్చని, యాప్​లోని సెర్చ్ బార్ ద్వారా కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది.
Published by:Veera Babu
First published: