Home /News /technology /

SNAP CHAT USERS ARE EXCITED ABOUT THE SUBSCRIPTION PLAN NEW FEATURES WHAT IS THE PLAN UMG GH

Snapchat+: స్నాప్ చాట్ యూజర్స్ కు అదిరిపోయే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. కొత్త ఫీచర్లు.. ప్లాన్ ఎంతంటే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ (Snapchat) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు(Features) తీసుకొస్తోంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ సరికొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. అయితే ఇంకా రిలీజ్ కాని ఫీచర్లను కూడా ఇకపై ఇండియన్ యూజర్లు (Users)పొందవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ ఫొటో మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ (Snapchat) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు(Features) తీసుకొస్తోంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ సరికొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. అయితే ఇంకా రిలీజ్ కాని ఫీచర్లను కూడా ఇకపై ఇండియన్ యూజర్లు పొందవచ్చు. ఈ మేరకు తాజాగా స్నాప్‌చాట్+ (Snapchat+) సబ్‌స్క్రిప్షన్‌ సేవను ఈ ప్లాట్‌ఫామ్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో యూజర్లు ప్రత్యేకమైన (Exclusive), ప్రయోగాత్మక, ప్రీ-రిలీజ్ (Pre-release) ఫీచర్లను ముందస్తుగానే యాక్సెస్‌ చేయవచ్చు. అంతేకాదు, ప్లస్ యూజర్లు స్నాప్‌చాట్‌ టీమ్ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ అందుకోవచ్చు. మరి ఈ సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎంత? ఇందులో అందించిన ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటి? అనే వివరాలు చూద్దాం.

యూజర్లు స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌తో రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్‌లు, బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్, స్నాప్ మ్యాప్‌లో ఘోస్ట్ ట్రయల్స్, సోలార్ సిస్టమ్ వంటి ఆరు ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్లను పొందుతారు. సరికొత్త కస్టమైజ్డ్ ఫీచర్లతో వచ్చే ఈ సబ్‌స్క్రిప్షన్‌ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. భారతదేశంలో స్నాప్‌చాట్ ప్లస్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.49గా కంపెనీ నిర్ణయించింది. ఈ యాప్‌ను భారతదేశంలో 10 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. వీరు స్నాప్‌చాట్‌+ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. ఇండియాలో రూ.50 లోపే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చినా యూఎస్‌లో దాని ప్లస్ సర్వీస్‌కు నెలకు రూ.320 వసూలు చేస్తోంది.

ఇదీ చదవండి: Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !


ఇండియన్ సబ్‌స్క్రైబర్లు తమ ప్రొఫైల్‌కు స్టార్ హోదాకు సమానమైన స్నాప్‌చాట్+ బ్యాడ్జ్‌ను పొందుతారు. ఈ బ్యాడ్జ్‌ అనేది యూజర్లు ప్లస్ సర్వీస్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారని తెలియజేస్తుంది. ఈ ఫీచర్‌ డిఫాల్ట్‌గా టర్న్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి దీనిని మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే సబ్‌స్క్రైబర్లు హోమ్‌స్క్రీన్ ఐకాన్ల ప్యాక్‌ను సైతం పొందుతారు. స్నాప్‌చాట్ ఐకాన్ల లుక్‌ను నచ్చినట్లు కస్టమర్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సబ్‌స్క్రైబర్లు యాప్‌లో మై స్టోరీ మేనేజ్‌మెంట్ (My Story Management) సెక్షన్‌లో తమ స్టోరీస్‌ని మళ్లీ చూస్తున్న వ్యక్తుల సంఖ్యను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ఇతర యూజర్ల పేర్లను రివీల్ చేయదు.



Snapchat+ సబ్‌స్క్రైబర్లు సోలార్ సిస్టమ్‌ ఫీచర్‌కు యాక్సెస్‌ను పొందుతారు. ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్‌కు ఇదొక స్పెషల్ బ్యాడ్జ్. అంతేకాకుండా, వీరు తమ స్నాప్‌చాట్ స్నేహితుల్లో ఒకరిని తమ బెస్ట్ ఫ్రెండ్‌గా పిన్ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్ అందించే మరో ఫీచర్‌తో ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కడికి వెళ్లారో సాధారణ ప్రయాణ దిశను తెలుసుకోవచ్చు. స్నాప్ మ్యాప్‌లో ఈ ఫీచర్‌ని ది ఘోస్ట్ ట్రైల్ ఫీచర్ అంటారు. ఈ ఫీచర్ యాక్టివ్‌గా ఉండాలంటే యూజర్లు తమ లొకేషన్‌ను షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మ్యాప్ మూవ్స్ ఫీచర్‌ లాగానే పనిచేస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: New features, Public subscription, Snapchat, Users

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు