SMARTPHONES UNDER RS25K LOOKING FOR THE BEST PHONE UNDER RS25000 CHECK OUT THESE MODELS GH VB
Smartphones Under Rs.25K: రూ.25 వేల లోపు బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ మోడళ్లను పరిశీలించండి..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో రూ.25 వేల లోపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రూ.25 వేల లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..
భారతదేశంలో రూ.25 వేల లోపు స్మార్ట్‌ఫోన్(Smartphone) మార్కెట్లో పోటీ పెరిగింది. దేశంలోని వివిధ సంస్థలు మిడ్ రేంజ్ మార్కెట్లో(Mid Range Market) టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. రూ.25,000 ధర రేంజ్లో ఫాస్టెస్ట్ 5G చిప్సెట్స్, శక్తివంతమైన OLED డిస్ప్లేలు(Displays), సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్(Super Fast Charging), బెస్ట్ కెమెరాలను(Best Cameras) అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో(Indian Market) రూ.25 వేల లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు(Best Smart market) ఇవే..
* iQOO Z6 Pro 5G (రూ.23,999, 6GB/128GB, ఆండ్రాయిడ్ 12)
రూ.25 వేల కంటే తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్లలో ఐక్యూఓఓ జెడ్6 ప్రో 5జీ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. స్నాప్‌డ్రాగన్ 778G చిప్సెట్, బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ కోసం 2100mm2 వేపర్ ఛాంబర్ ఉన్నాయి. ఫోన్లో 4D వైబ్రేషన్ మోటార్, HDR10+ సపోర్ట్ చేసే 90Hz FHD+ AMOLED స్క్రీన్, 66W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700 mAh బ్యాటరీ, ట్రిపుల్-కెమెరా సెటప్ (64 MP+ 8 MP+ 2 MP) ఉన్నాయి.
* Oppo F21 Pro (రూ.22,999, 8GB/128GB, ఆండ్రాయిడ్ 12)
సెగ్మెంట్లో ఒప్పో ఎఫ్21 ప్రో బెస్ట్ హ్యాండ్సెట్. నోటిఫికేషన్ల కోసం ఆర్బిట్ లైట్‌తో కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 680 SoCతో జాబితాలో ఉన్న 4G స్మార్ట్ఫోన్లలో F21 ప్రో మరొకటి. ఫోన్లో 90Hz FHD+ AMOLED డిస్ప్లే, 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 బ్యాటరీ, ట్రిపుల్-కెమెరా సెటప్ (64MP +2MP +2MP) ఉన్నాయి.
* Redmi Note 11 Pro Plus (రూ.20,999, 6GB/128GB)
రెడ్మి నోట్ 11 ప్రో ప్లస్ బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. స్నాప్డ్రాటన్ 695 SoC, 120Hz FHD+ AMOLED స్క్రీన్, 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ, ట్రిపుల్-కెమెరా సెటప్ (108MP + 8MP + 2MP) ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.