హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Price Hike: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు... ఎప్పట్నుంచి అంటే

Smartphone Price Hike: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు... ఎప్పట్నుంచి అంటే

Smartphones: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు... ఎప్పట్నుంచి అంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphones: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు... ఎప్పట్నుంచి అంటే (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Price Hike | స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఏప్రిల్‌లో జీఎస్‌టీ కారణంగా ఓసారి ధరలు పెరిగాయి. త్వరలో మళ్లీ స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరిగే ఛాన్సుంది.

  కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? మీ మొబైల్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా? త్వరలో కొత్త ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వీలైనంత త్వరగా మీకు కావాల్సిన ఫోన్ కొనండి. లేకపోతే ఇప్పటికన్నా ఇంకాస్త ఎక్కువ ధర చెల్లించాల్సి రావొచ్చు. స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే అవకాశముంది. భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ల డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపై ఇంపోర్ట్ డ్యూటీ 10% విధిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దిగుమతుల కన్నా స్థానిక తయారీ రంగాలకు ప్రోత్సాహం కల్పించాలని భావిస్తోంది. దిగుమతుల్ని తగ్గించడంతో పాటు స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోళ్లు పెంచేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రణాళికలో భాగంగా స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే డిస్‍ప్లే, టచ్ ప్యానెళ్లపై 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తోంది. ఫేజ్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్-PMP లో భాగంగా అక్టోబర్ 1 నుంచే 10 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది.

  Flipkart Big Billion Days Sale: అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే

  Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... వెంటనే డిలిట్ చేయండి

  ఒక స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లేకు అయ్యే ఖర్చే 15 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డిస్‍ప్లే, టచ్ ప్యానెళ్లకు 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. యాపిల్, సాంసంగ్, షావోమీ, ఒప్పో, వివో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఇంకాస్త ఖరీదు కానున్నాయి. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్-ICEA అంచనా ప్రకారం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ప్రత్యక్షంగా ఉండనుంది. మొబైల్ ఫోన్ల ధరలు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు పెరగొచ్చు. అంటే రూ.10,000 ఫోన్‌పై అదనంగా రూ.150 నుంచి రూ.300 వరకు భారం పడే అవకాశముంది. ఇప్పటికే కొన్ని మొబైల్ కంపెనీలు ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల ధరలు ఈ ఏడాదిలో ఓసారి పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త జీఎస్‌టీ రేట్లు ప్రకటించడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు మరోసారి ధరలు పెరగబోతున్నాయి.

  Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

  Shopping tricks: షాపింగ్‌లో మీరు ఎలా మోసపోతారో తెలుసా? ఇలా

  ప్రస్తుతం హోలీటెక్, టీసీఎల్ సహా నాలుగు కంపెనీలు భారతదేశంలో డిస్‌ప్లే ప్యానెల్స్ తయారు చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, ఉత్పత్తి చేసే బ్రాండ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్-PLI స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఈ స్కీమ్ పట్ల ఆసక్తి చూపించాయి. మరి ఈ బ్రాండ్లకు దిగుమతి సుంకం వర్తిస్తుందో లేదో ప్రస్తుతానికైతే తెలియదు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Atma Nirbhar Bharat Abhiyan, Atmanirbhar Bharat, Realme, Realme Narzo, Realme UI, Redmi, Smartphone, Xiaomi

  ఉత్తమ కథలు