హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones: భారత మార్కెట్‌లోకి త్వరలో రానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ధరలు, స్పెసిఫికేషన్స్ మీకోసం..!

Smartphones: భారత మార్కెట్‌లోకి త్వరలో రానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ధరలు, స్పెసిఫికేషన్స్ మీకోసం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రాబోయే రోజుల్లో ఇండియాలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేయనున్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.    

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Smartphones: భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు(Smartphones) డిమాండ్ పెరుగుతోంది. దీంతో అనేక కంపెనీలు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనేక కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేశాయి. శామ్‌సంగ్(Samsung) నుంచి గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఏ34, ఏ35 భారత్ మార్కెట్‌లో అడుగు పెట్టగా, ఒప్పొ కంపెనీ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేయనున్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

* రెడ్‌మీ నోట్ 12 4G

షియోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మీ త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను రెడ్‌మీ నోట్ 12 4G పేరుతో తీసుకురానుంది. ఇది డిజైన్ విషయంలో రెడ్‌మీ నోట్ 12 5G మాదిరిగా ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ ఉపయోగించినట్లు సమాచారం. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్(50 MP+8MP+2MP), 13MP ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 5.0, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండవచ్చు. దీని ధర రూ.15వేల లోపు ఉండే అవకాశం ఉంది.

WhatsApp: వాట్సాప్ కొత్త అప్‌డేట్.. త్వరలో ఎడిట్ ఫీచర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

* ఒప్పొ రెనో 9

స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.30వేలలోపు ఉండవచ్చు. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల AMOLED డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 64 MP + 2 MP డ్యుయల్ కెమెరా సెటప్, 32 MP సెల్ఫీ కెమెరా, 4500 mAh బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలు.

* రెడ్‌మీ 12C

రెడ్‌మీ 12సీ బడ్జెట్ రేంజ్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.8,390గా ఉండవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్ 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లే, మీడియా‌టెక్ హీలియో G85 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, మైక్రో-యూఎస్‌బీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.

* షియోమి 13

ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రీమియం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.36 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించనుంది. ఇది 8 GB RAM‌తో కనెక్ట్ అయి ఉంటుంది. రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్(50 MP + 12 MP + 10 MP), 32 MP ఫ్రంట్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలుగా ఉండవచ్చు. దీని ధర రూ. 47,390గా ఉండవచ్చు.

First published:

Tags: Smart phone

ఉత్తమ కథలు