2030 నాటికి ప్రపంచంలో ఎక్కడా కూడా స్మార్ట్ఫోన్లు (Smartphones) లేకుండా కనుమరుగవుతాయా అని అడిగితే అవుననే అంటున్నారు నోకియా సీఈఓ(Nokia CEO) పెక్కా లండ్మార్క్. తాజాగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2022 సందర్భంగా నోకియా సీఈఓ పెక్కా లండ్మార్క్ (Nokia CEO Pekka Lundmark) భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ల(Smartphones) ఉనికి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ (6G) అందుబాటులోకి వస్తుందని, 6జీ మొబైల్ నెట్వర్క్(Mobile Network) ఒకసారి అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్లు(Smartphones) పురాతనమైనవిగా మారిపోతాయని చెప్పారు. “2030 నాటికి ఈ రోజు మనకు తెలిసిన ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ కామన్ డివైజ్(Device) అవ్వదు. స్మార్ట్‌ఫోన్‌లోని చాలా ఫీచర్లు మన శరీరంలో నేరుగా అందించడం జరుగుతుంది” అని స్విట్జర్లాండ్‌లోని(Switzerland) దావోస్‌లో(Davos) జరిగిన డబ్ల్యూఈఎఫ్ 2022లో పెక్కా చెప్పుకొచ్చారు.
2030 నాటికి స్మార్ట్ వేరబుల్స్ లేదా బాడీలో అమర్చే చిప్స్ వంటి ఇతర పరికరాలు స్మార్ట్ఫోన్లను అధిగమిస్తాయని పెక్కా పేర్కొన్నారు. 6జీ నెట్‌వర్క్‌ల లాంచింగ్ అనేది సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించగలదని, స్మార్ట్ఫోన్ల డిమాండ్‌ను గణనీయంగా తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2022లో స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉన్నాయి. మరి పెక్కా చేసిన ప్రకటన ప్రకారం ఎనిమిదేళ్లలో స్మార్ట్ఫోన్ల వాడకం తగ్గుతుందని నమ్మటం కాస్త కష్టంగానే అనిపిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు ఉపయోగించి వెబ్‌ని బ్రౌజ్ చేయడం కోసం మాత్రమే కాకుండా ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్‌లను బుక్ చేసుకోవడం, ప్రయాణంలో బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడం వంటి ఇతర పనులను కూడా యూజర్లు ఈజీగా చేసేస్తున్నారు.
మొబైల్ ఇండస్ట్రీలో 5జీ ఇంకా ప్రధాన నెట్‌వర్క్‌గా అందుబాటులోకి రాలేదు. కాబట్టి భవిష్యత్తులో 6జీ నెట్వర్క్ పోషించే ప్రాముఖ్యత లేదా పాత్రను అంచనా వేయడం కష్టం. ఈ ఏడాదిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుండగా, వచ్చే ఏడాది ప్రారంభంలోనే 5జీ నెట్‌వర్క్‌ను యూజర్లకు తీసుకురావాలని భారతదేశం కృషి చేస్తోంది. టెలికాం ఆపరేటర్స్ ఇప్పటికే తమ 5జీ నెట్వర్క్ని అమలులోకి తెచ్చాయి, అందుబాటులో ఉన్న డివైజ్‌ల ద్వారా 5జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నాయి.
జపాన్, మరికొన్ని దేశాలు 6జీ టెక్నాలజీపై పని చేయడం ప్రారంభించాయి, అయితే 2030 నాటికి దేశంలో 6జీని పరిచయం చేసేందుకు భారత ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 6జీకి భారీ కంప్యూటింగ్ శక్తి అవసరమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. 6జీ ప్రస్తుత నెట్‌వర్క్‌ల కంటే 1000 రెట్లు ఎక్కువ డేటా వేగాన్ని అందిస్తుందని టెక్ విశ్లేషకులు సూచించారు. మరోవైపు న్యూరల్ లింక్-బేస్డ్ డివైజ్‌లు భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. న్యూరాలింక్ వంటి అనేక కంపెనీలు శరీరంలో అమర్చగల చిప్‌లపై పని చేస్తున్నాయి. అయితే అలాంటి అప్లికేషన్లను బెటర్‌గా యూజ్ చేయడానికి 6జీ బెస్ట్ సోర్స్ నెట్వర్క్ కావచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.