స్మార్ట్‌ఫోన్ పేలుతున్న (Smartphone Explode) ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయి. గత వారం రోజుల్లో ఇలాంటి ఘటనలు పలు చోట్ల కలకలం రేపాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే లోపాల దగ్గర్నుంచి బయటి పరిస్థితుల వరకు మొబైల్ పేలడానికి (Mobile Blast) అనేక కారణాలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు అజాగ్రత్తగా ఉండటం కూడా మరో కారణం. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఛార్జర్, వినియోగించే సమయం లాంటా వాటి విషయంలో ఏఏ అంశాలు గుర్తుంచుకోవాలి? తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ పేలడానికి బ్యాటరీ వేడెక్కడం ఓ కారణం. స్మార్ట్‌ఫోన్‌లో ఒకేసారి ఎక్కువ యాప్స్ ఉపయోగిస్తే మొబైల్ వేడెక్కుతుంది. గేమ్స్ ఎక్కువసేపు ఆడినా ఫోన్ వేడిగా అవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో బ్యాటరీ సెక్షన్ ఓపెన్ చేసి ఏ యాప్స్ మీ బ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయో చూడండి. మీకు అవసరం లేని యాప్స్ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో చెక్ చేసి వాటిని డిలిట్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి. మొబైల్ ఎక్కువసేపు వాడినప్పుడు ఫోన్ వేడెక్కితే వాడటం కాసేపు ఆపడం మంచిది. ఇలా ఎక్కువగా వేడయ్యే బ్యాటరీలు చాలా డేంజర్.
Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది
ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ కాస్త వేడవుతుంది. ఆ సమయంలో ఎక్కువ వేడి అవుతున్నా, పదేపదే మీ మొబైల్ వేడెక్కుతున్నా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బ్యాటరీ హెల్త్ చెక్ చేయించండి. అవసరం అయితే కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయాలి. మీరు మరీ పాత ఫోన్ వాడుతున్నట్టైతే కనీసం రెండేళ్ల తర్వాత అయినా కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయడం మంచిది. మీ బ్యాటరీ స్వెల్లింగ్ అంటే వాపు వచ్చిందేమో చెక్ చేస్తూ ఉండండి. ఈ సమస్య కనిపించిందంటే మీరు వెంటనే బ్యాటరీ మార్చడం తప్పనిసరి.
ఓ 20 శాతం బ్యాటరీ తగ్గగానే ఛార్జింగ్ పెట్టడం చాలామందికి అలవాటు. 70 శాతం తగ్గిన తర్వాత అంటే 30 శాతం వరకు వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టడం అలవాటు చేసుకోండి. ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది. ఇక మీ ఫోన్ ఎప్పుడైనా కింద పడితే బ్యాటరీ డ్యామేజ్ అయిందేమో చెక్ చేయండి. బ్యాటరీ డ్యామేజ్ అయినా మొబైల్ పేలడానికి కారణం కావొచ్చు. కొత్త ఫోన్ కొన్నప్పుడే బ్యాటరీ పనితీరు ఎలా ఉందో చెక్ చేయండి. బ్యాటరీ పనితీరులో ఏదైనా తేడా అనిపిస్తే రిటర్న్ చేసి కొత్త మొబైల్‌తో రీప్లేస్ చేయండి. తయారీలో లోపాలు ఉన్నా మొబైల్ పేలే అవకాశాలు ఉంటాయి.
SBI Discount: ఎస్‌బీఐ కార్డ్ ఉన్నవారికి అమెజాన్‌లో రూ.10,750 వరకు డిస్కౌంట్
ఇక మీ మొబైల్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మీకు అలవాటా? ఆ అలవాటు మానెయ్యండి. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్లు వస్తున్నాయి కాబట్టి ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి రెండు గంటల సమయం కూడా పట్టదు. మీరు ఎనిమిది గంటలు నిద్రపోతే ఎనిమిది గంటలు మొబైల్‌ను ఛార్జింగ్ పెట్టడం అంటే మీరు ముప్పును కొనితెచ్చుకున్నట్టే. మొబైల్‌కు ఎంత సమయం ఛార్జింగ్ అవసరమో అంతసేపు పెడితే చాలు. ఇక రాత్రి నిద్రపోయేప్పుడు తల దగ్గర ఫోన్ అస్సలు పెట్టుకోకూడదు. వీలైతే మీ బెడ్‌కు దూరంగా మొబైల్‌ను పెట్టండి.
ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం కూడా అలవాటు. ఇలాంటి అలవాట్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నంతసేపు ఫోన్‌ను అలా వదిలేయడమే మంచిది. ఇక ఛార్జింగ్ కోసం ఒరిజినల్ ఛార్జర్లు మాత్రమే వాడండి. మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఛార్జర్లు అస్సలు ఉపయోగించకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Smartphone