Home /News /technology /

SMARTPHONE WALKING BANNED IN YAMATO CITY OF JAPAN KNOW WHY SS GH

Smartphone: నడుస్తూ స్మార్ట్‌ఫోన్ వాడటం నిషేధం... ఈ రూల్ ఎక్కడో తెలుసా

Smartphone: నడుస్తూ స్మార్ట్‌ఫోన్ వాడటం నిషేధం... ఈ రూల్ ఎక్కడో తెలుసా
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone: నడుస్తూ స్మార్ట్‌ఫోన్ వాడటం నిషేధం... ఈ రూల్ ఎక్కడో తెలుసా (ప్రతీకాత్మక చిత్రం)

Ban on Smartphone Walking | మీకు రోడ్డుపైన స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే అలవాటు ఉందా? నడుస్తూ నడుస్తూ అలా ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటారా? ఇక్కడ ఎవరూ ఏమీ అనరేమో కానీ అక్కడ మాత్రం నిషేధం విధించారు.

  నడకలో స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని జపాన్‌కి చెందిన యమటో నగరంలో నిషేధించారు. ఈ నగరం జపాన్ రాజధాని టోక్కోకు 30 కిలో మీటర్లో దూరంలో ఉంటుంది. తాజాగా స్మార్ట్‌ఫోన్ నడకను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం తీర్మానించింది. పాదాచారులు స్మార్ట్‌ఫోన్ వాడుతూ నడుస్తుండటం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని అక్కడి అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరిలో యమటో సిటీలో 6000 మంది పాదాచారులపై చేసిన అధ్యయనం ప్రకారం యమటో నగరంలో12% మంది నడుస్తున్నప్పుడు వారి ఫోన్‌లను ఉపయోగిస్తున్నారని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైనదని అధ్యయనంలో వెల్లడైంది.

  ఈ విషయాలపై అధ్యయనం చేసిన యమటో నగర మేయర్ సతోరు ఓహ్కి తెలిపారు. ఓహ్కి మొదట్లో స్థానిక చట్టసభ సభ్యులతో ఈ ఆలోచనను ఆవిష్కరించారు. దానితోపాటు బహిరంగ సంప్రదింపులు జరిపిన తరువాత10 మందిలో ఎనిమిది మంది ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. సంప్రదింపుల తర్వాత జపాన్ ప్రభుత్వం జూన్ నెలలో మునిసిపల్ ఆర్డినెన్స్ ద్వారా నడకలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది. నిషేధం అమలు చేసిన ప్రభుత్వం దీన్ని పర్యవేక్షణకు కొంత మంది కార్మికులను నియమించింది.

  Poco M2: పోకో ఎం2 రిలీజ్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్

  Samsung Galaxy m51: రిలీజ్‌కు ముందే తెలిసిపోయిన సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్

  Smartphone walking, Smartphone walking banned in japan, smartphone accidents, smartphone addiction, mobile related diseases, mobile phone dependence, effects of smartphone, స్మార్ట్‌ఫోన్, జపాన్, యమటో నగరం, స్మార్ట్‌ఫోన్ వ్యసనం
  ప్రతీకాత్మక చిత్రం


  ప్రపంచంలో ఇటువంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారేం కాదు. దక్షిణ కొరియాలోని ఇల్సాన్, ఫోన్-స్క్రోలింగ్ పాదచారులను అప్రమత్తం చేయడానికి రోడ్ క్రాసింగ్‌ల వద్ద ఫ్లాష్ లైట్లు మరియు లేజర్ కిరణాలను ఏర్పాటు చేసింది. అలాగే చైనాలోని చాంగ్‌కింగ్‌ నగరంలో ఫోన్లలో బిజీగా ఉన్న పాదచారులకు 30 మీటర్ల సెల్‌ఫోన్ లేన్‌ను మార్గాన్ని అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు.

  జపనీస్ పౌరులకు స్మార్ట్‌ఫోన్ వాడుతూ నడవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని. వాటిపై జపాన్ ప్రజలకు అవగాహన ఉందని ఇటీవల చేసిన ఒక సర్వే తెలిపింది. జపాన్‌లో 562 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై 2019 లో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ సర్వేలో 96.6% మంది తమకు ప్రమాదాల గురించి తెలుసునని, 13.2% మంది మొదటిసారి ఇతరులకు తాకామని, 9.5% మంది గాయపడినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  iPhone 12: యాపిల్ ఫ్యాన్స్‌కు సస్పెన్స్... ఐఫోన్ 12 రిలీజ్ ఎప్పుడు?

  WhatsApp status: వాట్సప్ స్టేటస్‌లో ఈ సీక్రెట్ ట్రిక్స్ మీకు తెలుసా?

  Smartphone walking, Smartphone walking banned in japan, smartphone accidents, smartphone addiction, mobile related diseases, mobile phone dependence, effects of smartphone, స్మార్ట్‌ఫోన్, జపాన్, యమటో నగరం, స్మార్ట్‌ఫోన్ వ్యసనం
  ప్రతీకాత్మక చిత్రం


  అయితే ఈ చర్యను జపాన్ వాసులు పాటిస్తారో లేదో చూడాలి. ఈ చట్టంపై యమటో మేయర్ ఓహ్కి మాట్టాడుతూ "ఈ చట్టాన్ని రేపో ఎల్లుండో లేక ఒక సంవత్సరంలో మార్చాలనే ఉద్దేశంతో రూపొందించలేదు. కనీసం ఐదేళ్లు దీన్ని విజయవంతంగా అమలు చేయాలని భావిస్తున్నాం" అన్నారు. జపాన్లో వృద్ధాప్య జనాభా ఎక్కువ. కాబట్టి వృద్ధులను రక్షణకు ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.

  ఇది విజయవంతం అవుతుందని భావిస్తున్నానన్నారు. "పది సంవత్సరాల క్రితం నడకలో ధూమపానం చేయడానికి వ్యతిరేకంగా ఒక చట్టం చేశాం, ప్రజలు దీన్ని స్వీకరించడానికి కొంత సమయం పట్టింది, కానీ ప్రస్తుతం ఇది మంచి ‌‌ఫలితాలిస్తోంది" అని అన్నారు. తాజాగా చేసిన యాంటీ-స్మార్ట్ఫోన్ చట్టం అమలు తీరు సామాజిక వివరణపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన పౌరులకు ఎటువంటి శిక్ష లేదు.

  అందువల్ల దీన్ని ఎంతమంది పాటిస్తారనేది ప్రశ్నార్థకమే! ఈ చట్టం రాబోయే కొద్ది నెలల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉందని కూడా కొంతమంది పౌరులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Addiction, Japan, Smartphone

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు