SMARTPHONE TIPS KNOW HOW MUCH CAMERA YOU NEED IN YOUR SMARTPHONE SS
Smartphone Camera: మీ స్మార్ట్‌ఫోన్‌కి కెమెరా ఎంత అవసరమో తెలుసా?
Smartphone Camera: మీ స్మార్ట్‌ఫోన్‌కి కెమెరా ఎంత అవసరమో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
Smartphone Camera | స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ఎంత ఉంటే చాలు? ఎన్ని కెమెరాలు ఉంటే ఫోటోలు అంత బాగా వస్తాయా? మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే ఫోటోలు బాగా తీసుకోవచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉండేవే.
స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ర్యామ్, మెమొరీ, బ్యాటరీ ఎంత అని చూడటంతో పాటు కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్ ఉందని కూడా పరిశీలిస్తారు. ఎవరైనా కొత్త ఫోన్ కొన్నారని తెలిస్తే 'కెమెరా ఎలా ఉంది' అని ఆరా తీస్తుంటారు. చాలామంది కెమెరా కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటుంటారు. ఫోటోగ్రఫీపై, సెల్ఫీలపై ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్లంతా మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటారు. అందుకే మొబైల్ కంపెనీలు కూడా స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఫోటో శాంపిల్స్‌ని ప్రచారం చేస్తుంటాయి. ఇటీవల షావోమీ, రియల్మీ లాంటి కంపెనీలు అయితే ఏకంగా సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్లతో ఫోటో షూట్స్ నిర్వహించి మరీ తమ ఫోన్లను ప్రచారం చేసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ కెమెరాలో రకరకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. పోర్ట్రైట్, హైబ్రిడ్ జూమ్, మ్యాక్రో లెన్స్, నైట్ మోడ్, అల్ట్రా వైడ్... ఇలా అనేక ఫీచర్లతో ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల రియల్మీ ఏకంగా నాలుగు కెమెరాలతో రియల్మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయడం విశేషం. త్వరలో నోకియా ఏకంగా 5 కెమెరాలతో ఫోన్ తీసుకురానుంది.
ఈ రోజుల్లో ప్రతీ కంపెనీ మంచి కెమెరాలతోనే ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ఎంత ఉంటే చాలు? ఎన్ని కెమెరాలు ఉంటే ఫోటోలు అంత బాగా వస్తాయా? మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే ఫోటోలు బాగా తీసుకోవచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉండేవే. స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాను తక్కువగా వాడేవారైతే డ్యూయెల్ కెమెరా ఉన్న ఫోటోలు చాలు. ఆ కెమెరాతో పోర్ట్రైట్ మోడ్ ఫోటోలు తీసుకోవచ్చు. అది కూడా 5 మెగాపిక్సెల్ వరకు ఉంటే చాలు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ట్రిపుల్ కెమెరా లేదా క్వాడ్ కెమెరా ఫోన్స్ ట్రై చేయొచ్చు. ప్రొఫెషనల్ స్థాయిలో ఫోటోలు క్లిక్ చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగపడ్తాయి. ఇందులో ప్రైమరీ సెన్సార్‌లో ఆటో ఫోకస్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ జూమ్ కోసం ఉపయోగపడుతుంది. అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ పనోరమా షాట్స్ ఉంటాయి. నాలుగో కెమెరా ఫోటోలకు మరిన్ని మెరుగులు దిద్దుతుంది. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్లు ఇలాంటి స్మార్ట్ఫోన్లు తీసుకోవచ్చు.
ఇక మెగాపిక్సెల్ విషయానికొస్తే... ఇప్పుడు 48 మెగాపిక్సెల్ స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. రెడ్మీ నోట్ 7 ప్రో, హానర్ వ్యూ 20, హువావే పీ30 ప్రో, రెడ్మీ కే20 ప్రో, రెడ్మీ నోట్ 7ఎస్,మోటోరోలా వన్ విజన్ లాంటి స్మార్ట్‌ఫోన్లల్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఒకప్పుడు 2 మెగాపిక్సెల్‌తో స్మార్ట్‌ఫోన్ ఉండటమే గొప్ప. కానీ ఆ తర్వాత 4ఎంపీ, 8ఎంపీ, 16ఎంపీ, 32ఎంపీ దాటి 48 ఎంపీ వరకు వచ్చేశాం. త్వరలో 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసేందుకు షావోమీ, రియల్మీ లాంటి కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ లోపే స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. మొన్న షావోమీ రిలీజ్ చేసిన ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్లో మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే ఫోటోలు క్లారిటీగా వస్తాయన్నది వాస్తవం. కానీ... ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ ఉన్నా... ఫోటోలు ఫోటో క్లిక్ చేసేవారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. ఇటీవల రిలీజైన స్మార్ట్‌ఫోన్లల్లో మంచి ఫోటోలు క్లిక్ చేయగల స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.