Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా చేయండి

Smartphone Tip | స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడితే ఏం చేయాలి? చాలామందికి ఈ విషయం తెలియక ఫోన్ పాడుచేసుకుంటారు. స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడ్డా కాస్త అప్రమత్తంగా ఉంటే ఫోన్ పాడుకాకుండా చూసుకోవచ్చు.

news18-telugu
Updated: March 28, 2019, 10:23 AM IST
Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా చేయండి
Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా చేయండి
news18-telugu
Updated: March 28, 2019, 10:23 AM IST
ప్రమాదవశాత్తు స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడటం చూస్తూనే ఉంటాం. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారిలో చాలామందికి ఇలాంటి అనుభవం మామూలే. వర్షంలో మీతో పాటు మీ స్మార్ట్‌ఫోన్ కూడా తడిసిపోయే అవకాశాలు ఎక్కువ. సర్వీస్ సెంటర్లకు రిపేర్ల కోసం వచ్చే ఫోన్లల్లో చాలావరకు వాటర్ డ్యామేజీ ఫోన్లే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడితే ఏం చేయాలి? చాలామందికి ఈ విషయం తెలియక ఫోన్ పాడుచేసుకుంటారు. స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడ్డా కాస్త అప్రమత్తంగా ఉంటే ఫోన్ పాడుకాకుండా చూసుకోవచ్చు. మరి స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడితే ఏం చేయాలి? తెలుసుకోండి.

Read this: Facebook Login Alert: మీ ఫేస్‌బుక్‌లో ఇతరులు లాగిన్ అయితే అలర్ట్ మెసేజ్... సెట్టింగ్స్ ఇవే

smartphone water damage, how to fix a water damaged phone that wont turn on, how do you fix a water damaged phone?, how to fix a water damaged phone after a month, fixing a phone dropped in water, i dropped my phone in water and it wont turn on, how to get water out of your phone without rice, i dropped my phone in water but it still works, dropped phone in water screen wont work, స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్యామేజ్, స్మార్ట్‌ఫోన్ సర్వీసింగ్, స్మార్ట్‌ఫోన్ రిపేర్

మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లల్లో పడ్డ వెంటనే బయటకు తీయండి. ఫోన్ ఎంత ఎక్కువసేపు నీళ్లల్లో ఉంటే అంత డ్యామేజీ తప్పదు. ఫోన్ నీళ్లలోంచి తీయగానే ఎక్కువగా కంగారుపడకండి. నీళ్లల్లోంచి తీసిన వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ ఆఫ్ చేయండి. స్మార్ట్‌ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత కర్చీఫ్ లేదా టిష్యూతో బాగా తుడవండి. మీ ఫోన్‌ను రెండుమూడుసార్లు గట్టి షేక్ చేస్తే లోపల ఉన్న నీళ్లు, బయటకు వస్తాయి. కాసేపు మీ ఫోన్‌ను ఆరబెట్టండి. హెయిర్ డ్రయర్ ఉంటే లో సెట్టింగ్‌తో డ్రై చేయొచ్చు. యూఎస్‌బీ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్, రిసీవర్, పవర్, వాల్యూమ్ బటన్స్ ఇలా అన్నివైపులా డ్రై చేయండి.



Read this: WhatsApp Chat: వాట్సప్‌లో ఈ షార్ట్‌కట్ మీకు తెలుసా?

smartphone water damage, how to fix a water damaged phone that wont turn on, how do you fix a water damaged phone?, how to fix a water damaged phone after a month, fixing a phone dropped in water, i dropped my phone in water and it wont turn on, how to get water out of your phone without rice, i dropped my phone in water but it still works, dropped phone in water screen wont work, స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్యామేజ్, స్మార్ట్‌ఫోన్ సర్వీసింగ్, స్మార్ట్‌ఫోన్ రిపేర్

మీ ఫోన్‌ పూర్తిగా డ్రై అయిపోయిందని అనిపిస్తే పవర్ ఆన్ చేయండి. ఇంకా అనుమానం ఉంటే ఓ జార్‌లో మీ ఫోన్ పెట్టి సిలికా జెల్ బ్యాగ్స్ జార్‌లో వేయండి. సిలికా జెల్ బ్యాగ్స్ లేకపోతే జార్‌లో బియ్యం పోయండి. కొన్ని గంటలపాటు అలాగే ఉంచండి. ఫోన్‌లో ఉన్న తేమను బియ్యం పీల్చేస్తుంది. కొన్ని గంటల తర్వాత జార్‌లోంచి ఫోన్ తీసెయ్యండి. ఆ తర్వాత ఫోన్ ఆన్ చేయండి. ఇన్ని చేసినా మీ ఫోన్ ఆన్ కాకపోతే సర్వీస్ సెంటర్‌కు వెళాల్సిందే.
Loading...
Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

NTA UGC NET 2019: యూజీసీ నెట్‌ పాసైతే 5 లాభాలు ఇవే... మార్చి 30 చివరి తేదీ

IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చు
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...